రాష్ట్ర మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి బూమ్ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరగబోయే ప్రభుత్వ భూముల వేలం ఈ బూమ్‌కు నాంది పలకనుంది.
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ (యూఎస్సీ) నిధుల కోసం ఆందోళన చేస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం తమ బంద్‌ను విరమించుకున్నాయి.
కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు, యూరియా సరఫరా సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై బండి సంజయ్ కడుపుమంట వ్యాఖ్యలు చేసి సర్కారుపై తీవ్రస్థాయిలో దాడి చేశారు.
Telangana: తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్య త్వరలో తీరనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనితో రాష్ట్రానికి అదనంగా మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన 40 వేల టన్నులకు అదనంగా లభించనుంది. Medha School : సంచలనం.. మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్.. […]
ఇంస్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం ఒక భార్యను ఎంతటి దారుణానికి పాల్పడేలా చేసిందో ఈ ఘటన రుజువు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా, గడ్డి గూడెం తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా మత్తుమందును తయారు చేసి విక్రయిస్తున్న మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్‌ను ఈగల్ టీం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది.