డిసెంబరు 25 రేస్ లో బెల్లం vs మేక..
తండ్రి శ్రీకాంత్ నటనను వారసత్వంగా తీసుకున్న రోషన్ మేక. టాలీవుడ్ హృతిక్ రోషన్‌లా పేరైతే వచ్చింది కానీ సినిమాలు కంప్లీట్ చేయడంలో జోరు చూపించడం లేదు. రోషన్ పెళ్లి సందడితో స్టార్ అయ్యాడు కానీ ఎక్కడైతే స్టార్టైయ్యాడే అక్కడే ఆగిపోయాడు. నాలుగేళ్లుగా అతడి నుండి ఫిల్మ్ రాలేదు. ప్రజెంట్ ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు రోషన్. ఈ ఇయర్ రోషన్ బర్త్ డే సందర్భంగా ఛాంపియన్ మూవీ ఎనౌన్స్ మెంట్ చేసింది స్పప్న సినిమాస్. మాలీవుడ్ బ్యూటీ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా టాలీవుడ్‍కు పరిచయం కాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 25న సినిమా తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. క్రిస్మస్ బరిలో సినిమాను దింపడం ఇప్పుడు హాట్ టాపికయ్యింది. అదే రోజు అడవి శేష్.. డెకాయిట్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు. కానీ అడివి శేష్ కు గాయం అవడం షూటింగ్ డిలే అవడంతో రిలీజ్ వాయిడా వేశారు. కానీ ఛాంపియన్ తో ఢీ కొట్టేందుకు వస్తున్నాడు బెల్లంకొండ. కిష్కింధపురి సూపర్ హిట్ తో మంచి జోరు మీదున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్నాడు. మరో రెండు షెడ్యూల్స్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ చేయబోతున్నారు. డెకాయిట్ పోస్ట్ పోన్ తో సోలో రిలీజ్ దొరికిందనుకున్న ఛాంపియన్ కు టైసన్ నాయుడుతో పోటీ ఎదురవుతోంది. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో.
జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర ప్రమాదం.. భారీ శబ్దాలతో పేలిన గ్యాస్ సిలిండర్లు
రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రక్కును ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. భారీ శబ్దాలతో పేలిపోవడంతో సమీప గ్రామ ప్రజలు, వాహనదారులు హడలెత్తిపోయారు. హైవేపై సిలిండర్లు పేలిపోవడంతో ఆగి వున్న వాహనాలపై కూడా ప్రభావం చూపించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కిలోమీటర్ల మేర భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సహా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని జైపూర్ ఐజీ రాహుల్ ప్రకాష్ తెలిపారు.ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా సంఘటనాస్థలిని పరిశీలించారు. పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
టాలీవుడ్‌కి కమ్‌బ్యాక్ చేస్తున్న పూజా హెగ్డే.. షాకింగ్ రెమ్యునరేషన్
టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం రవి నెలకుడితి దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో చాలాకాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నది గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవలి సంవత్సరాలలో బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో సినిమాలు తగ్గించారు. ముఖ్యంగా ఆమె భారీ పారితోషికం కారణంగానే టాలీవుడ్‌కు దూరమయ్యారని అప్పట్లో ఓ టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇస్తూ అదే స్థాయిలో పారితోషికం అందుకుంటోందని సమాచారం. ఈ మూవీలో నటించేందుకు పూజా ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట. ఇది ఆమె మార్కెట్ ఇంకా ఎలాంటి స్థాయిలో ఉందో చూపిస్తున్నది.
రష్యా సైన్యం తరపున పోరాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు..
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న ఓ భారతీయుడు ఉక్రెయిన్ దళాలకు పట్టబడ్డాడు. మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. గుజరాత్‌లోని మోర్బి నివాసి మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ యుద్ధభూమిలో కేవలం మూడు రోజులు గడిపిన తర్వాత 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్‌కు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపినట్లు సమాచారం. కైవ్‌లోని భారత మిషన్ ధృవీకరిస్తోందని ANI నివేదిక తెలిపింది.
మాజీ సీఎం జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన అనుమతులుపైఉత్కంఠ…
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన అనుమతులుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషనర్ సిటీ పరిధిలో పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చారు. జగన్ సహా 10 వాహనాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేషనల్ హైవే మీద వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోడ్ షోలు, జన సమీకరణ చేస్తే పర్యటనను అర్ధాంతరంగా నిలిపివేస్తామని షరతులు విధించారు.. రోడ్డు మార్గంలో జగన్ నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి లేదని అనకాపల్లి ఎస్పీ ప్రకటించారు. మరోవైపు… అనుమతి ఉన్నా లేకపోయినా పర్యటన జరిగి తీరుతుందని వైసీపీ ప్రకటించింది. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించించారు.
ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో స్మృతి మంధాన
భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసిసి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల క్రికెట్ వన్డే కప్‌లో పలువురు టాప్ ప్లేయర్స్ రాణించినప్పటికీ వారిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ముందు రెండు శతకాలతో మెరిసిన టీమిండియా వైస్ కెప్టెన్ 791 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతోంది. మంధాన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా, దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. న్యూజిలాండ్‌పై సెంచరీ తర్వాత రెండు స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమ నాల్గవ స్థానానికి చేరుకుంది.
ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. 4 రోజులుగా నిలిచిపోయిన వందలాది వాహనాలు
ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నాలుగు రోజులుగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ముందుకెళ్లే పరిస్థితి లేదు.. వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. తిండి తిప్పలు లేవు. ఇలా నాలుగు రోజులుగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. బీహార్‌లోని కురిసిన భారీ వర్షాలు కారణంగా ఢిల్లీ-కోల్‌కతా హైవేపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం బీహార్‌లోని రోహాస్త్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో జాతీయ రహదారి-19లోని వివిధ ప్రదేశాలు నీళ్లతో నిండిపోయాయి. దీంతో వాహనాలు ఆయా ప్రాంతాలకు మళ్లించారు. అయినా కూడా గత నాలుగు రోజులుగా బీహార్‌లోని ఢిల్లీ-కోల్‌కతా హైవేలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. బంపర్-టు-బంపర్ క్యూలో నిలిచి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి.. వెనక్కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక నిత్యావసర వస్తువులతో ఉన్న వాహనాలు కంపుకొడుతున్నాయి. మరోవైపు మంచినీళ్లు, ఆహారం దొరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా సమస్య పరిష్కరించాలని వాహనదారులు వేడుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ.. క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణలోని పలు జిల్లాల నేతలు హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబుతో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని నియామకం, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. నేతల సమాచారం ప్రకారం, తెలంగాణలో ఇప్పటికే 1.78 లక్షల మంది పార్టీ సభ్యత్వం పొందారని చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీల నియామకాలు త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అయితే, తాత్కాలికంగా రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా వారు అభిప్రాయపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. ప్రభాకర్ రావు అరెస్ట్ దిశగా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. అమెరికాలో ఉన్న సమయంలో ప్రభాకర్ రావు తన నివాసంలోని ల్యాప్‌టాప్‌లోని ఆధారాలను ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపించింది.
న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. సీజేఐ దాడిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటనను ప్రధాని మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. కానీ కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు మాత్రం.. దాడికి యత్నించిన న్యాయవాది ధైర్యాన్ని ప్రశంసించారు. న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. భాస్కర్ రావు బెంగళూరు కమిషనర్‌గా పని చేశారు. ‘‘చట్టపరంగా తప్పు అయినప్పటికీ వయస్సుతో సంబంధం లేకుండా ఒక వైఖరి తీసుకుని దానికి అనుగుణంగా జీవించే మీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను.’’ అని ఎక్స్‌లో భాస్కర్ రావు రాశారు.