మహిళా క్రికెటర్ స్మృతీ మంధనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోని అందం స్మృతీ మంధనా సొంతం. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. చిన్నతనంలో పెళ్లి చేసుకొంటే హృతిక్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ, […]
ప్రస్తుతం ఎక్కడ చూసిన నాటు నాటు సాంగ్ మాత్రమే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. రాజమౌళి దర్శకత్వంలో వారిద్దరూ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.. జనవరి 7 న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఇటీవల సెకండ్ సింగిల్ నాటు నాటు సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పాట అందరిలోనూ ఫుల్ […]
మగాడు.. ఎప్పుడు గంభీరంగా ఉండాలి.. ఆడది.. ఎప్పుడు తల దించుకొని ఉండాలి. సమాజంలో ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. మగాడు ఏడవకూడదు.. ఏడిస్తే.. చూడు వాడు ఆడదానిలా ఏడుస్తున్నాడు అని గెలిచేస్తారు.. పరిస్థితిని బట్టి కూడా మగాడు కన్నీటి చుక్క రాల్చకూడదు.. సింహం, పులి అని వారిని పోలుస్తూ.. సింహాలు ఏడవవు అని నొక్కి వక్కాణించేస్తారు. కానీ, మగాళ్లు ఖచ్చితంగా ఏడవాలి అని కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. అలా ఏడిస్తేనే మనిషిలో ఉన్న భారం మొత్తం […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న ‘జై భీమ్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో సూర్య యాక్టింగ్, ఆ కథ వెరసి ఆ సినిమాను ఊహించలేనంత విజయాన్ని అందుకునేలా చేశాయి. అయితే దీనిపై ఒక పక్క వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సూర్య జంకడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక కథను సూర్య ఎంచుకోవడం.. దానిని ఆయనే స్వయంగా నిర్మించడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. […]
‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ బాటలో సినిమా రంగ ప్రవేశం చేయబోతోందట. అయితే భాగ్యశ్రీ తన కూతురి తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయబోతోంది. టాలీవుడ్ అయితే తనకి చక్కటి గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది. బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందబోయే కొత్త […]
అర్ధరాత్రి అందరు నిద్రపోతున్నారు.. ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంది.. అప్పుడే ఒక జంట నిదానంగా నడుచుకుంటూ వచ్చారు. ఎవరైనా చూస్తున్నారా..? లేదా అని అటు ఇటు తొంగి చూశారు.. అందరు నిద్రలో ఉన్నారు.. ఎవరు తమను గుర్తించడంలేదని నమ్మకం కుదిరాక వచ్చిన పని కానిచ్చేశారు.. తెల్లారి వారి నిర్వాకం సీసీటీవీ ఫుటేజీ లో చూసి అందరు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్‌కు చెందిన ఓ యువతి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం తప్పుదారి తొక్కింది. […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్ ను యంగ్ హీరో కార్తికేయ తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు. విశేషం ఏమంటే కెరీర్ ప్రారంభం నుండి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్న కార్తికేయ ఈ మూవీతోనూ నయా డైరెక్టర్ శ్రీ సరిపల్లిని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ ఎలా ఉందో తెలుసుకుందాం. విక్రమ్ (కార్తికేయ) ఎన్.ఐ.ఎ. ఏజెంట్. ఓ కేసులో పొరపాటు చేసి సస్పెండ్ అవుతాడు. […]
అర్ధరాత్రి.. ఆ ఆసుపత్రిలో ఉన్న రోగులందరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అంతలోనే సడెన్ గా ఒక యువకుడు వార్డులో పరుగులు పెట్టాడు.. అందరు నిద్రమత్తులో లేచి చూశారు.. అయినా యువకుడి పరుగు ఆగలేదు.. డైరెక్ట్ గా టెర్రస్ మీదకు వెళ్లి ఆగిన యువకుడిని వెంబడించిన వారు కూడా ఆగారు. యువకుడు వెనుక ఉన్నవారిని పట్టించుకోకుండా అక్కడి నుంచి కిందకు దూకేశాడు. ఒక్కసారిగా ఆఘటనను చుసిన మిగతావారు షాక్ కి గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్ లో వెలుగుచూసింది. […]
అత్యాశ.. మనిషిని ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. కొంతమంది చెప్పే మాయమాటలు విని, డబ్బు కోసం అత్యాశపడితే చివరికి జైలే గతి.. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయమైన మరో వ్యక్తి మాటలు నమ్మి, అత్యాశకు పోయి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఒక పురాతన ఇల్లు ఉంది.. వారి తాతముత్తాతల నుంచి సంక్రమించిన ఇల్లు కావడంతో కుటుంబంతో […]
‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన మూడో చిత్రం ‘పుష్పక విమానం’. విశేషం ఏమంటే ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థన్ రావు దీన్ని నిర్మించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన కమల్ హాసన్ సైలెంట్ మూవీ ‘పుష్పక విమానం’ పేరునే దీనికీ పెట్టడంతో సహజంగానే తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమా […]