ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న ‘జై భీమ్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో సూర్య యాక్టింగ్, ఆ కథ వెరసి ఆ సినిమాను ఊహించలేనంత విజయాన్ని అందుకునేలా చేశాయి. అయితే దీనిపై ఒక పక్క వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సూర్య జంకడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక కథను సూర్య ఎంచుకోవడం.. దానిని ఆయనే స్వయంగా నిర్మించడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. అంతేకాకుండా థియేటర్స్ లో విడుదల చేయకుండా ఓటిటీలో విడుదల చేయాలనే సూర్య నిర్ణయానికి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇలాంటి ఒక సున్నితమైన కథను వెరీ ఇంట్రెస్టింగ్ గా మలిచి ఓటిటీ కి అమ్మేయడం అంటే మాములు విషయం కాదు. ఇదంతా సూర్య తెలివితేటల వలనే సాధ్యమయ్యింది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కరోనా సమయంలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోకు సూర్య రూ. 10 కోట్లుకు విక్రయించాడు.
తమిళ తెలుగు హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేయడంతో అమెజాన్ సంస్థ, సూర్య సొంత నిర్మాణ సంస్థకు 45 కోట్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే నాలుగు రెట్లు లాభం పొందినట్లు అయ్యింది. త్వరలోనే మరో సినిమాను కూడా సూర్య ఓటిటీలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక హీరోగా, నిర్మాతగా ఒక మంచి సినిమాను ప్రజలకు అందించాడు సూర్య.. అయితే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తెలివితేటలు మన సీనియర్ హీరోలకు రావడం లేదా అని పలువురుతూ విమర్శిస్తున్నారు. ఎంతోమంది హీరోలు తమ సినిమాలకు నిర్మాతగా మారుతున్నారు. ఒక మంచి కథను ఎంచుకొని, వారు కూడా సూర్యలానే విజయాలను అందుకోవచ్చు కానీ వారు మాత్రం ప్రయత్నించడంలేదని బాహాటంగానే చెప్తున్నారు.