అర్ధరాత్రి అందరు నిద్రపోతున్నారు.. ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంది.. అప్పుడే ఒక జంట నిదానంగా నడుచుకుంటూ వచ్చారు. ఎవరైనా చూస్తున్నారా..? లేదా అని అటు ఇటు తొంగి చూశారు.. అందరు నిద్రలో ఉన్నారు.. ఎవరు తమను గుర్తించడంలేదని నమ్మకం కుదిరాక వచ్చిన పని కానిచ్చేశారు.. తెల్లారి వారి నిర్వాకం సీసీటీవీ ఫుటేజీ లో చూసి అందరు షాక్ అయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్‌కు చెందిన ఓ యువతి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం తప్పుదారి తొక్కింది. రాత్రిళ్ళు బాయ్ ఫ్రెండ్ తో కలిసి వాహనాలను దొంగతనం చేయడం మొదలుపెట్టింది. అందరు నిద్రపోయాక ఆ జంట బైక్ లను చోరీ చేయడం స్టార్ట్ చేసారు. అందులో అన్నీ యువతి మాత్రమే బైక్ లు చోరీ చేయడం గమనార్హం. ఇటీవల ఒక ఏరియాలో యువతి నిదానంగా బండి వద్దకు రావడం.. చాకచక్యంగా స్కూటీ తాళం తీసి స్వయంగా యాక్టివాను స్టార్ చేసి.. తనతో పాటు వచ్చిన యువకుడిని ఎక్కించుకుని వాహనంతో సహా పారిపోయింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ఉదయం ఆ స్కూటీ ఓనర్ తన బండి కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడంతో వారి నిర్వాకం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ చూసినా పోలీసులు సైతం, షాక్ తిన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.