మగాడు.. ఎప్పుడు గంభీరంగా ఉండాలి.. ఆడది.. ఎప్పుడు తల దించుకొని ఉండాలి. సమాజంలో ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. మగాడు ఏడవకూడదు.. ఏడిస్తే.. చూడు వాడు ఆడదానిలా ఏడుస్తున్నాడు అని గెలిచేస్తారు.. పరిస్థితిని బట్టి కూడా మగాడు కన్నీటి చుక్క రాల్చకూడదు.. సింహం, పులి అని వారిని పోలుస్తూ.. సింహాలు ఏడవవు అని నొక్కి వక్కాణించేస్తారు. కానీ, మగాళ్లు ఖచ్చితంగా ఏడవాలి అని కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. అలా ఏడిస్తేనే మనిషిలో ఉన్న భారం మొత్తం పోయి ప్రశాంతత వస్తుందని తేల్చారు.
వేదనతో మనసు రగిలిపోయినప్పుడు ఏడవడానికి ఆడ అయితే ఏంటి..? మగ అయితే ఏంటి..? మనుసులో బాధను బయటపెట్టడానికి మగవాడు కూడా ఏడవచ్చు.. అందులో తప్పు లేదు. అలా కాకుండా నేను మగవాడిని .. ఏడవకూడదు అని అలాగే కూర్చుంటే ఆ బాధ అంతా లోపలే దిగమింగుకొంటే స్వీయ ఆంక్షల చట్రంలో తమకు తామే కీడు చేసుకున్నట్టే అని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెప్తున్నారు. మనసులో బాధను కన్నీళ్ల ద్వారానే బయటికి రప్పించగలరంట.. మగవారు ఎక్కువగా ఏడవకుండా ఉండడం వలనే ఎక్కువ స్ట్రెస్ కి, ఆత్మన్యూన్యతా భావానికి గురి అవుతున్నారట. తమ బాధలను పక్కవాళ్లతో పంచుకోని మగవారు చివరికి ఏకాకులుగా మిగిలిపోతారని వారు చేసిన కొత్త అధ్యయనంలో తేలింది. దాదాపు 5500 మంది మగాళ్లపై చేసిన ఈ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
ప్రతి మనిషికి నవ్వు ఎంత ముఖ్యమో.. ఏడుపు కూడా అంతే ముఖ్యమంట.. మంలో ఉన్న భావాల ద్వారా కళ్ల గ్డరందుల్లో కన్నీళ్లు ఉత్పత్తి అవుతాయంట.. వాటిని రిలీజ్ చేయకపోతే మెదడు చురుగ్గా పనిచేయదట.. మగవారులో ఇది ఎక్కువగా కనిపిస్తుందట… మనుసులో బాధలను ఎవరికి చెప్పకుండా.. ఏడవకుండా ఉండడం వలన ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారని అధ్యయనం తెలుపుతోంది. అందుకే ఎవరు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి బాధలో ఉంటె మనసారా ఏడవండి.. అందులో తప్పేంలేదు..