ఇంటికొచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తాను అంది.. సరేనని ఆ మహిళ ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఇంట్లోకి ఆహ్వానించింది.. వ్యాక్సిన్ కన్నా ముందు కళ్లలో చుక్కలు వేయాలని.. ఒక మందు సీసాతో నిలబడింది. వ్యాక్సిన్ ఎలా వేస్తారో తెలియని ఆమె సరే అంది. అంతే ఇదే అదును అనుకోని కంట్లో చుక్కలు వేసి ఆమె మేడలో ఉన్న బంగారు గొలుసును తెప్పుకుబోయింది కిలాడీ లేడి.. ఈ ఘటన కర్నూల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. స్టాంటన్‌పురంలో […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ‘పుష్ప’ ఐటెం సాంగ్ గురించే చర్చ. సమంత నర్తించిన ఏ పాటలో మగవారి మనోభావాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాటినేమి పట్టించుకోకుండా మ్యూజిక్ ని , సమంత అందచందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సాంగ్ ని వేరే సినిమా నుచి కాపీ కొట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సూర్య నటించిన ‘వీడోక్కడే’ చిత్రంలోని ఐటెం సాంగ్ […]
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం 1950లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను జెమినీ పతాకంపై ఎస్.ఎస్.వాసన్ హిందీలో ‘ఇన్సానియత్’గా రీమేక్ చేశారు. 1955లో విడుదలైన ఈ సినిమాలో ఏయన్నార్ పాత్రలో దిలీప్ కుమార్, యన్టీఆర్ పాత్రలో దేవానంద్ నటించారు. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి […]
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్. రఘువరన్ 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లెంగోడెలో జన్మించారు. ఆయన తండ్రి హోటల్ నడిపేవారు. మధురలో హోటల్ […]
భారతదేశంలో స్టార్ హీరోస్ గా రాజ్యమేలిన వారిలో అత్యధిక కాలం జీవించిన నటునిగా దిలీప్ కుమార్ చరిత్ర సృష్టించారు. అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ స్టార్ హీరోగా రాజ్యమేలిన ఏ గ్రేట్ యాక్టర్ కూడా 98 సంవత్సరాలు జీవించలేదు. ఆ క్రెడిట్ దిలీప్ సాబ్ కే దక్కింది. ఈ యేడాది జూలై 7న దిలీప్ కుమార్ కన్నుమూశారు. డిసెంబర్ 11న దిలీప్ కు 99 ఏళ్ళు పూర్తయి, నూరవ ఏట అడుగుపెట్టి ఉండేవారు. అందువల్ల […]
మనిషిని చంపడానికి భయం ఒక్కటి చాలు.. ఆ భయం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. కరోనా భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒమిక్రాన్ భయంతో ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. బంగారంలాంటి కుటుంబాన్ని తన చేతులారా చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైద్యశాలలో విధులు నిర్వహించే సుశీల్ […]
పలు పురస్కారాలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దివంగత నటి, భరతనాట్య కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో ‘యదలో మౌనం’. ఇందులో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. ఇందులో ఇంకా విఘ్నేష్ […]
కరోనా సెకండ్ వేవ్ తర్వాత చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలు విడుదల.. వాటి ప్రమోషన్లు.. రోజు సినిమా అప్డేట్స్ తో కళకళలాడుతోంది.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది.. ఇక పుష్ప సైతం తమ ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. తాజాగా సమంత ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసి అంచనాలను పెంచిన మేకర్స్ .. ప్రీ రిలీజ్ పార్టీకి కూడా ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఆదివారం హైదరాబాద్ […]
‘వకీల్ సాబ్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల .. ఈ అచ్చ తెలుగమ్మాయి ఈ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందిపుచ్చుకొంటుంది. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్నా మరోపక్క తన అందచందాలను సోషల్ మీడియాలో ఎరగా వేసి కుర్రాళ్లను తనవైపు లాక్కొంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానవులపై విరుచుకుపడుతున్న ఈ బ్యూటీ తాజాగా మరో ఫోటోతో కుర్రకారును ఫిదా చేసింది. తాజాగా అనన్య ఒక ఫోటోను సోషల్ […]