ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ‘పుష్ప’ ఐటెం సాంగ్ గురించే చర్చ. సమంత నర్తించిన ఏ పాటలో మగవారి మనోభావాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాటినేమి పట్టించుకోకుండా మ్యూజిక్ ని , సమంత అందచందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సాంగ్ ని వేరే సినిమా నుచి కాపీ కొట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
సూర్య నటించిన ‘వీడోక్కడే’ చిత్రంలోని ఐటెం సాంగ్ ‘హాని హాని’ ని పోలి ఉందని చెప్తున్నారు.. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా సాంగ్ విన్నాక అదే సాంగ్ విన్నట్లు ఉందని, దేవి శ్రీ ప్రసాద్ కాపీ ట్యూన్ కొట్టాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు సాంగ్స్ పక్కన పెట్టి మ్యూజిక్ సేమ్ ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు ఒరిజనల్ కన్నా ఈ సాంగ్ ఇంకా బావుందని తెలుపుతున్నారు. ఏది ఏమైనా పాట హిట్ అవ్వడం ముఖ్యం అన్నట్లుగా చిత్రబృందం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సాంగ్ థియేటర్లో ఎంతటి రచ్చ చేస్తుందో చూడాలి. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది.