కరోనా సెకండ్ వేవ్ తర్వాత చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలు విడుదల.. వాటి ప్రమోషన్లు.. రోజు సినిమా అప్డేట్స్ తో కళకళలాడుతోంది.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది.. ఇక పుష్ప సైతం తమ ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. తాజాగా సమంత ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసి అంచనాలను పెంచిన మేకర్స్ .. ప్రీ రిలీజ్ పార్టీకి కూడా ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఆదివారం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో జరగనుంది.
ఇక ప్రస్తుతం ఈ ఈవెంట్ కి గెస్టులు ఎవరు అనేది టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరు, ప్రభాస్, షాహిద్ కపూర్ వస్తున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయిపోతే తాజాగా ఈ వార్తలను పుష్ప మేకర్స్ ఖండించారు. ఇటీవల పుష్ప ప్రెస్ మీట్ లో పాల్గొన్న నిర్మాతలు మాట్లాడుతూ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులను ఎవరిని ఆహ్వానించలేదని, చిత్ర బృందం తప్ప మరెవ్వరు రావడం లేదని తేల్చి చెప్పేశారు.
ఈ వేడుకకు బన్నీ, చిత్రబృందం మాత్రమే వస్తున్నారని, అతిధులుగా అభిమానులు మాత్రమే వస్తున్నారని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ప్రభాస్, చిరు లాంటివారు వస్తున్నారని తెలియడంతో ఈ ఈవెంట్ ఇంకా హైప్ అవుతుందని అనుకోని సంతోషం వ్యక్తం చేసిన అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి బన్నీ ఒక్కడే ఈ మాస్ పార్టీని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.