‘వకీల్ సాబ్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల .. ఈ అచ్చ తెలుగమ్మాయి ఈ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందిపుచ్చుకొంటుంది. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్నా మరోపక్క తన అందచందాలను సోషల్ మీడియాలో ఎరగా వేసి కుర్రాళ్లను తనవైపు లాక్కొంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానవులపై విరుచుకుపడుతున్న ఈ బ్యూటీ తాజాగా మరో ఫోటోతో కుర్రకారును ఫిదా చేసింది. తాజాగా అనన్య ఒక ఫోటోను సోషల్ మీడియా షేర్ చేసింది. విద్యుత్ దీపాల మధ్య పింక్ కలర్ డ్రెస్ లో చేతిలో పూలనే ఎద భాగాన్ని కప్పి ఉంచేలా పట్టుకొని వయ్యారంగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ నిలబడింది.
సడెన్ గా ఈ ఫోటో చూసిన ఎవరైనా పూలతోనే అమ్మడు డ్రెస్ వేసుకుందా ..? అనేలా అనుమానం వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు పువ్వుల్లో దాగున్న పళ్లేమో అతిశయం అంటూ ఈ అతివను పొగడ్తలతో ముంచేస్తున్నారు. తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారని అంటున్నా.. అవకాశం వస్తే అందాల ఆరబోతకు మేము సిద్దమే అన్నట్లు ఈ ఫోటోషూట్లే తెలుపుతున్నాయి. మరి అలాంటి అవకాశాలు ఈ తెలుగందానికి చిక్కుతాయేమో చూడాలి.