Mahi V Raghav: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం యాత్ర 2. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు.
Esha Deol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమామాలిని కూతురు, నటి ఈషా డియోల్ అభిమానులకు చేదువార్త చెప్పింది. తన భర్త భరత్ తక్తానీతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Rashmika Mandanna: ఒక సినిమా హిట్ అయితే.. హీరోయిన్ కు కానీ, హీరోకు కానీ కామన్ గా వినిపించే రూమర్.. రెమ్యూనిరేషన్ పెంచేశారు అని. అయితే అందులో నిజం ఎంత అనేది తెలియకపోయినా అన్ని కోట్లు పెంచారట.. ఇన్ని కోట్లు పెంచారట అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటి రూమర్స్ ను చాలామంది పట్టించుకోరు.
Malvi Malhotra: ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు ఉండే ఇబ్బందులు అందరికి తెలిసినవే. అయితే ఆ సమయంలో వారు పడిన ఇబ్బందులు ఎవరికి చెప్పినా పట్టించుకోరు. అదే హీరోయిన్ సక్సెస్ అయిన తరువాత చేప్తే.. అవునా.. ? నిజమా.. ? అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. కొంతమంది మేకర్స్.. హీరోయిన్స్ తో సినిమాలు తీసాకా పారితోషికాలు ఎగ్గొడుతూ ఉంటారు.
The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఉపాసనను అందరూ ట్రోల్ చేసినవారే. ఆమె లుక్ చూసి చరణ్ కు సరైన జోడీ కాదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత పదేళ్లుగా వీరికి పిల్లలు లేకపోవడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ట్రోల్ కూడా చేశారు.
TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Gaanza Shankar: విరూపాక్ష సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను అనౌన్స్ చేయకుండా కథలను ఆచితూచి ఎంచుకొని.. హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్.