The Kerala Story: హమ్మయ్య.. ఎట్టేకలకు వివాదాస్పద సినిమా ఓటిటీకి వచ్చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ చిత్రం మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు ఎన్నో వివాదాలు అలుముకున్నాయి. రిలీజ్ అయ్యాకా సినిమాను బ్యాన్ చేయాలనీ రాజకీయ నేతలు చాలా కష్టపడ్డారు. థియేటర్లకు ప్రేక్షకులను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం మొత్తం ఈ సినిమా రిలీజ్ అయ్యాకా అట్టుడికిపోయింది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కూడా వివాదాలే అడ్డంకులుగా మారాయి. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎన్నో నెలలుగా ఈ సినిమా ఓటిటీలో ఈ నెల వస్తుంది .. వచ్చే నెల వస్తుంది అని వార్తలు వచ్చాయే కానీ మేకర్స్ మాత్రం అధికారిక డేట్ ను అనౌన్స్ చేసింది లేదు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ ఖరారు అయ్యింది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ5.. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 16 నుంచి అన్ని భాషల్లో ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!