Rashmika Mandanna: ఒక సినిమా హిట్ అయితే.. హీరోయిన్ కు కానీ, హీరోకు కానీ కామన్ గా వినిపించే రూమర్.. రెమ్యూనిరేషన్ పెంచేశారు అని. అయితే అందులో నిజం ఎంత అనేది తెలియకపోయినా అన్ని కోట్లు పెంచారట.. ఇన్ని కోట్లు పెంచారట అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటి రూమర్స్ ను చాలామంది పట్టించుకోరు. కానీ మన నేషనల్ క్రష్ మాత్రం ఇలాంటివాటిని తిప్పికొట్టడంలో ముందు ఉంటుంది. నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక అనిమల్ సినిమాతో అమ్మడికి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత ఈ చిన్నది అమాంతం రెమ్యూనిరేషన్ పెంచేసిందని రూమర్స్ క్రియేట్ అయ్యాయి.
అనిమల్ సక్సెస్ తో రష్మిక ఒక్కసారిగా రెమ్యునరేషన్ ని పెంచేసిందని, ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోందని ఒక నెటిజన్ రశ్మికను ట్యాగ్ చేసి అడిగేశాడు. వేరేవాళ్లు అయితే వాటిని లైట్ తీసుకొనేవారు.. కానీ, రష్మిక మాత్రం తనదైన రీతిలో సమాధానం ఇచ్చేసింది. ” ఇది చూసి నేనే షాక్ అయ్యా.. ఇవి చూసాకా నాకు నిజంగానే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను కూడా ప్రొడ్యూసర్స్ ని ఇదే అడుగుతా.. నాకు రెమ్యూనిరేషన్ పెంచమని.. ఎందుకు అంటే.. సోషల్ మీడియాలో వచ్చిన దానికి కట్టుబడి ఉండేందుకు ఇలా చేస్తున్నా అని వారికి వివరిస్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కొంచెం సెటైరికల్ గా చెప్పినా కూడా రష్మిక ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2 తో పాటు మరో రెండు సినిమాలను చేస్తోంది.