Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఉపాసనను అందరూ ట్రోల్ చేసినవారే. ఆమె లుక్ చూసి చరణ్ కు సరైన జోడీ కాదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత పదేళ్లుగా వీరికి పిల్లలు లేకపోవడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ట్రోల్ కూడా చేశారు. ఇక ఉపాసన తన వ్యక్తిత్వంతో అందరి మనసులను గెలుచుకుంది. మెగా కోడలిగా బాధ్యతలు చేపడుతూనే.. ఇంకోపక్క అపోలో బాధ్యతలు చేపట్టి సేవలు అందిస్తుంది. ఇక పదేళ్ల తరువాత చరణ్ – ఉపాసన క్లింకారకు జన్మనిచ్చారు. ఇప్పటివరకు తామెందుకు తల్లిదండ్రులు కాలేదో ఆమె ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఆ విషయాన్నీ గుర్తుచేసింది.
“ప్రతి మహిళ తల్లి కావడం చాలా గ్రేట్ అనుకుంటారు. కానీ, నా దృష్టిలో డబుల్ గ్రేట్. నేను ఇంకా తల్లిని కాలేదని చాలామంది అన్న మాటలు నావరకు వచ్చాయి. చరణ్, నేను ముందే అనుకున్నాం. మేము మా బిడ్డకు అన్ని సమకూర్చేవరకు తల్లిదండ్రులు కాకుండదని నిర్ణయించుకున్నాం. అందుకే ఇన్నేళ్లు ఆగాము. ఇక చరణ్ తో నాకున్న బాండింగ్ గురించి చెప్పాలంటే.. అతను నాకెప్పుడూ చెప్పేది ఒకటే.. ప్రేమలో పడకు.. ప్రేమలో ఎదుగుదాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అనే చెప్తాడు. మా ఇద్దరి మధ్య చాలా హద్దులు ఉన్నాయి. నేను తన పని విషయంలో జోక్యం చేసుకోను. నా వర్క్ విషయంలో తను కలుగజేసుకోడు. పర్సనల్ విషయాల్లో మేము ఒక్కటే” అని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.