Nani:న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో చిరంజీవి, రవితేజ తరువాత నాని పేరే చెప్పుకొస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కథలను ఎంచుకొనే విధానంలో నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్య నాని చేసిన సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.
Laxman Bhatt Tailang: భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియా మరియు వయోవృద్దాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనను జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీ తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికల బరిలో ఆయన దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటన తరువాత అభిమానులు అందరూ ఆయనను పవన్ కళ్యాణ్ తో పోల్చడం మరింత హాట్ టాపిక్ గా మారింది.
Sitara Ghattamaneni: సోషల్ మీడియా వచ్చాకా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారు. సోషల్ మీడియా అధికారిక అకౌంట్స్ ను హ్యాక్ చేసి.. కొన్ని లింక్స్ పంపించి వాటిని సెలబ్రిటీలే క్లిక్ చేసుకోమని చెప్పినట్లు చూపించి ప్రజలవద్ద నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.
Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలుదేనికి దేనికి దానికి విభిన్నం అని చెప్పాలి. నవ్వించినా, ఏడిపించినా నరేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన వ్యక్తిగత విషయాల వలన సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డాడు కానీ. నటన విషయంలో నరేష్ ను ఎవరు తీసిపడేసే వారే లేరు.
Suhas: కలర్ ఫోటోతో హీరోగా మారి.. మంచి అందుకున్నాడు సుహాస్. ఈ సినిమా తరువాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ ఒకపక్క కమెడియన్ గా, ఇంకోపక్క విలన్ గా.. మరోపక్క హీరోగా విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటివరకు సుహాస్ చేసిన మూడు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు తో డీసెంట్ హిట్ కొట్టాడు.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు SSMB29 ఫీవర్ అందుకుంది.
Chiyaan 62: చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే తంగలాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా కాకుండా విక్రమ్, ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. తన 62 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ కొన్నేళ్లుగా హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ప్రస్తుతం గోపీచంద్ ఆశలన్నీ భీమా సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు.
Mahi V Raghav: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు.