Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలుదేనికి దేనికి దానికి విభిన్నం అని చెప్పాలి. నవ్వించినా, ఏడిపించినా నరేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన వ్యక్తిగత విషయాల వలన సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డాడు కానీ. నటన విషయంలో నరేష్ ను ఎవరు తీసిపడేసే వారే లేరు. ఇక సినిమా కోసం గానీ, పాత్ర కోసం కానీ నరేష్ ఏదైనా చేస్తాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నరేష్ అభిమానులతో పంచుకున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, ఆది పినిశెట్టి లకు తండ్రిగా నరేష్ నటించాడు. ఈ సినిమాలో పెద్దకొడుకు ఆది పిన్నిశెట్టి చనిపోయినప్పుడు ఓరయ్యో నా అయ్యా అనే సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో నరేష్ కొడుకుని తలుచుకొని గట్టిగా గుండెలు బాదుకుంటూ ఏడ్చే సీన్ హైలెట్ గా నిలిచింది. ఈ సీన్ కోసం నరేష్ ఎంతో కష్టపడినట్లు తెలిపాడు.
“సుకుమార్ నా దగ్గరకు వచ్చి సర్ ఈ సీన్ కోసం మీరు రోజంతా ఏడవాల్సి ఉంటుంది అని చెప్పాడు. ముందు ఓరయ్యో నా అయ్యో సాంగ్ విన్నప్పుడే నాకు ఏడుపు ఆగలేదు. దీంతో నేను వెంటనే నాకు గ్లిజరిన్ అవసరం లేదు అని చెప్పాను. అప్పుడు సుకుమార్ ఏంటి జోక్ చేస్తున్నావా..? అని అడిగారు. లేదండీ నేను గ్లిజరిన్ లేకుండానే ఏడుస్తాను అని చెప్పాను. అలానే ఆ సాంగ్ ను పూర్తి చేశాను. నా సినిమాల్లో ప్రత్యేకంగా మేనరిజం అంటూ ఏదీ ఉండదు. అలా చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎంత అవసరమో అంతవరకు నటించడమే నాకు ఇష్టం. సినిమా.. సినిమాకి, పాత్రను బట్టి దాని పరిధి వరకు నటించాలి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఆ సినిమాలో ఓరయ్యో నా అయ్యా సాంగ్ ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.