Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ కొన్నేళ్లుగా హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ప్రస్తుతం గోపీచంద్ ఆశలన్నీ భీమా సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఎదో ఎదో మాయ అంటూ సాగే సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ స్వరపరిచిన ఎదో ఎదో మాయ అద్భుతమైన రొమాంటిక్ నంబర్. కంపొజింగ్ చాలా ప్లజెంట్ వుంది, వెంటనే పాటతో ప్రేమలో పడతాము. కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం కథానాయకుడు తాను గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి పట్ల చూపే ఆరాధనను వర్ణిస్తుంది. అతను ఆమెతో సమయం గడపడానికి తన ఇగోలను పక్కన పెట్టే పోలీసు. టీచర్‌గా పరిచయమైన మాళవిక శర్మ కూడా పిల్లలతో కలిసి మెలిసి వారికి సహాయం చేస్తూ కనిపించింది. గోపీచంద్, మాళవిక జంట తెరపై లవ్లీ, బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కట్టిపడేసింది. మొత్తంమీద పాట శాశ్వతమైన ముద్ర వేస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.