Suhas: కలర్ ఫోటోతో హీరోగా మారి.. మంచి అందుకున్నాడు సుహాస్. ఈ సినిమా తరువాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ ఒకపక్క కమెడియన్ గా, ఇంకోపక్క విలన్ గా.. మరోపక్క హీరోగా విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటివరకు సుహాస్ చేసిన మూడు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు తో డీసెంట్ హిట్ కొట్టాడు. ఇకపోతే ఈ సినిమాను హిట్ చేసినందుకు సుహాస్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రేక్షకులు తనను ఆదిరిస్తున్నందుకు రుణపడి ఉంటానని, ఇలాగే తన మిగతా సినిమాలను కూడా ఆదిరించమని కోరాడు.
“అందరికి నమస్కారం,అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ని మేము అనుకున్నట్లుగానే ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ కి కామెంట్స్ పెట్టడం దగ్గరనుంచి ఇప్పుడు Book My Show లో టికెట్స్ కొనే వరకు, నన్ను దగ్గరికి తీస్కొని ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీ యొక్క ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిది..నటుడిగా నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు, నా స్థాయిలో కథలను ఎంచుకుని మీ ముందుకు తీసుకురావడమే నా ఈ చిన్న ప్రయత్నం. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వాటికి ఉదాహరణలు.వచ్చే నెలల్లో నేను కథానాయకుడుగా మీ ముందుకి రాబోయే ప్రసన్న వదనం, దిల్ రాజు గారు నిర్మాతగా సందీప్ రెడ్డి బండ్ల ప్రాజెక్ట్ (Untitled ) మరియు కేబుల్ రెడ్డి సినిమాలతో మీరు థియేటర్ కి వచ్చి హాయిగా నవ్వుకొని ఆస్వాదించే ఇంకొక మూడు మంచి సినిమాలతో మీ ముందుకి రాబోతున్నాను.హ్యాట్రిక్ ఇచ్చినందుకు థాంక్స్. మరొక హ్యాట్రిక్ ఇస్తారు అని నా ప్రయత్నం నేను చేస్తూనే, మీ ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట గా మారింది.
— Suhas 📸 (@ActorSuhas) February 9, 2024