Chiyaan 62: చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే తంగలాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా కాకుండా విక్రమ్, ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. తన 62 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సిద్దార్థ్ తో చిత్తా అనే మూవీ తీసి హిట్ అందుకున్న దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్. ఆ సినిమా తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి స్టార్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఎస్ జె సూర్య.. విక్రమ్ 62లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ గతంలో ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య ఎంట్రీతో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం వెల్లడించింది. చియాన్ విక్రమ్, ఎస్‌జె సూర్యల కలయికతో అభిమానులలో అంచనాలను పెంచడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.