Mahi V Raghav: యాత్ర 2 కు నెగెటివ్ రివ్యూలు .. డైరెక్టర్ ఏమన్నాడంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahi V Raghav: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 8న విడుదల చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఘన విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ..”నేను తీసిన యాత్ర 2 కొందరికి నచ్చింది.. ఇంకొందరికి నచ్చలేదు.. తీసిందే పొలిటికట్ మూవీ, రాజకీయ నాయకుడి మీద కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కానీ ఓ స్టోరీ టెల్లర్‌గా, నేను అనుకున్న కథ, స్క్రిప్ట్‌ను తీశాను. చాలా మందికి నా సినిమా నచ్చింది. అందరూ తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొంత మంది పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. ఇంకొంత మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత. విమర్శించారు కదా? నేనేమీ దాన్ని డిఫెండ్ చేసుకోను. మా టెక్నికల్ టీంకు థాంక్స్. మమ్ముట్టి గారు, జీవా గారికి థాంక్స్. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాన్నుంచి బయటకు వచ్చేస్తా. యాత్ర 2 తీయాలని 2019లోనే నిర్ణయించుకున్నా. తండ్రీ కొడుకుల కథ చెప్పాలని అనుకున్నా. ఆ కథకు తగ్గట్టుగానే పాత్రలను పెట్టాను. వేరే పాత్రలు లేవు అని అంతా అడుగుతుంటారు. కానీ నా కథకు తగ్గట్టుగానే నేను పాత్రలు పెట్టుకున్నాను. సీఎం వైఎస్ జగన్ గారు ఇంకా సినిమాను చూడలేదు. త్వరలోనే చూస్తారు. నంద్యాల బై ఎలక్షన్ సీన్ తీశాను. కానీ ఎడిటింగ్‌లో తీసేశాను. సినిమా విడుదలై ఒక్క రోజే అయింది. సినిమా విడుదల రోజే మేం థియేటర్లకు వెళ్తే రియాల్టీ తెలియదు. సోమవారం నుంచి రియల్ టాక్ తెలుస్తుంది. థియేటర్లో మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు వీలైనంతగా సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తా. మీడియా కూడా సహకరించాలి. త్వరలోనే సేవ్ ది టైగర్స్ 2 రాబోతోంది. నేను ఓ కథను రాయడానికే టైం పడుతుంది. మెల్లిగానే సినిమాలు చేస్తాను. ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుని సినిమాలు చేయాలని అనుకుంటున్నా” అని అన్నారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?