Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు SSMB29 ఫీవర్ అందుకుంది.ప్రస్తుతం మహేష్ బాబు ఫోకస్ అంతా ఇకపై ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ SSMB29 పైనే వుంది. ఇక ఈ సినిమా కోసం ఈ మధ్యనే మహేష్ విదేశాలకు కూడా వెళ్లి వచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అయ్యిందని ఇప్పటికే విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ లుక్ మార్చడం మొదలుపెట్టాడు. గుంటూరు కారం లో లైట్ గా గడ్డం, జుట్టుతో కనిపించిన మహేష్.. రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్ ను పెంచుతున్నాడు.
తాజాగా మహేష్ కొత్త లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి పెళ్లి ఫిబ్రవరి 14న అద్వైత రెడ్డి అనే అమ్మాయితో జైపూర్ ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఫ్యామిలీ పలువురు సెలబ్రిటీలను కలిసి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్, మోహన్ బాబు, రామ్ చరణ్ కి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. తాజాగా మహేష్, నమ్రతలను కలిసి శుభలేఖ అందజేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోలలో మహేష్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ లుక్ లో మహేష్ అదిరిపోయాడు. ఇది ఖచ్చితంగా SSMB29 కోసమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.