Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీ తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికల బరిలో ఆయన దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటన తరువాత అభిమానులు అందరూ ఆయనను పవన్ కళ్యాణ్ తో పోల్చడం మరింత హాట్ టాపిక్ గా మారింది. సినిమాలను వదిలేసి ఈ హీరోలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో పవన్ బాటలోనే విజయ్ కూడా నడుస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం సినిమాలు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాడు. ఆ తరువాత ఆ మాటను వెనక్కి తీసుకొని ఒక్కో సినిమా చేసుకుంటూ వచ్చాడు. అయితే దానికి కారణం తన వద్ద డబ్బులు లేవని పార్టీ ఫండ్ కోసం సినిమాలో చేస్తున్నట్లు పవన్ తెలిపాడు. సేమ్ ఇలాగే విజయ్ కూడా తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే సినిమాలన్నీ మానేస్తాను అని తెలిపాడు. అందుకోసమే విజయ్ ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలను పూర్తిచేసి.. పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపాడు.
ఇకపొతే విజయ్ ఈ రెండు సినిమాలతోనే ఆగడం లేదని, మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రాజకీయ రంగప్రవేశం అప్పటికప్పుడు జరిగిందా..? ఓ ప్లానింగ్ ప్రకారం జరిగిందా.. ? అన్నది పక్కన పెడితే.. విజయ్ అంతకుముందు కొంతమంది డైరెక్టర్లకు, నిర్మాతలకు సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విజయ్ పై ఖచ్చితంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఉన్నట్లు సమాచారం. అంటే విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తీసే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ అంటే డబ్బు కోసం చేస్తున్నట్లు అధికారికంగా తెలిపాడు. అయితే విజయ్ ఈ మాట నిలబెట్టుకోవడానికి చేస్తున్నాడా.. ? లేక విజయ్ కూడా డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. రాజకీయం అంటే మాటలు కాదు. విజయ్ ఇప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తాన్ని రాజకీయాల్లో పెట్టాలి. అది సరిపోతుందా.. ? లేదా అనేది కూడా తెలియదు. ఒకవేళ ఆ డబ్బు కోసమే విజయ్ కూడా ఇంకో రెండు సినిమాలు చేస్తున్నాడా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.