Today (14-02-23) Business Headlines: ‘‘కోనసీమ’’ను కొంటారా?. మరిన్ని వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (14-02-23) Business Headlines:
సుజుకీతో టీ హబ్ ఒప్పందం
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
జపాన్ కంపెనీ సుజుకీ మోటార్‌తో తెలంగాణ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి స్టార్టప్‌లు ఆ దేశంలోని అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. టీ హబ్‌లోని స్టార్టప్‌లు సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గైడెన్స్ పొందొచ్చని తెలిపింది. మొబిలిటీ సెక్టార్‌లో ఎదురయ్యే ఛాలెంజ్‌లకు ఇదొక సొల్యూషన్ మాదిరిగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియన్ స్టార్టప్స్ వరల్డ్ వైడ్‌గా రాణించేందుకు వీలు కలుగుతుందని టీ హబ్ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు.
IAICC హైదరాబాద్ చాప్టర్
ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఛాంబ్ ఆఫ్ కామర్స్.. IAICC.. హైదరాబాద్ చాప్టర్ తొలి చైర్మన్‌గా సురేష్ రాయుడు చిట్టూరి నియమితులయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న మన దేశస్తులు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేందుకు ఈ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. IAICC హైదరాబాద్ చాప్టర్ ఆవిర్భావ సభ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. మరో అర్ధ శతాబ్ధంలో ఇండియన్ ఎకానమీ 40 లక్షల కోట్ల డాలర్ల రేంజ్‌కి ఎదుగుతుందని పేర్కొన్నారు. సురేష్ రాయుడు చిట్టూరి.. శ్రీనివాసా ఫార్మ్స్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ అనే సంగతి తెలిసిందే. IAICCకి ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో చాప్టర్లు ఉన్నాయి.
రిటైల్ ద్రవ్యోల్బణంలో వృద్ధి
జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3 నెలల గరిష్టానికి చేరుకుంది. తద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన కంఫర్ట్ జోన్‌ను మళ్లీ దాటిపోయింది. అక్టోబర్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అత్యధికంగా 6 పాయింట్ ఏడు ఏడు శాతానికి చేరుకోగా జనవరిలో 6 పాయింట్ ఐదు రెండు శాతంగా నమోదైంది. పప్పు ధాన్యాలు, ప్రొటీన్ ప్రొడక్ట్స్‌తోపాటు ఆహార పదార్థాల రేట్లు పెరగటం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ రేటు డిసెంబర్‌లో నాలుగు పాయింట్ ఒకటీ తొమ్మిది మాత్రమే ఉండగా జనవరిలో 5 పాయింట్ తొమ్మిది నాలుగు శాతానికి పెరిగింది.
హైదరాబాద్ ఐఎస్‌బీ మళ్లీ
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. ISB.. మరోసారి.. దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్‌గా నిలిచింది. ఇంటర్నేషనల్ టాప్-50 బిజినెస్ స్కూల్స్‌లో 39వ ర్యాంకును, ఆసియాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ ISBలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవటం విశేషం. ఫైనాన్షియల్ టైమ్స్ సంస్థ.. గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్-2023 పేరుతో వీటిని విడుదల చేసింది. అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో ఉన్న 50 బిజినెస్ స్కూల్స్‌లో ఇండియా నుంచి హైదరాబాద్ ISBకి మాత్రమే చోటు లభించటం చెప్పుకోదగ్గ అంశం. పరిశోధనల విషయంలోనూ ఇది ఇండియాలో తిరుగులేని సంస్థగా పేరొందింది.
కోనసీమ ఆస్తులు అమ్మకానికి
కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్.. KGPL ఆస్తులను విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిడ్‌లను సైతం ఆహ్వానించారు. ఔత్సాహికులు ఈ నెల 27వ తేదీ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 13వ తేదీన ఇ-వేలం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెంలో ఈ సంస్థకు ఉన్న 445 మెగావాట్ల న్యాచురల్ గ్యాస్ బేస్డ్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్‌ను అమ్ముతారు. దీంతోపాటు ఈ ప్లాంట్‌కు చెందిన 126 ఎకరాలకు పైగా భూమిని మరియు మరో ఆరెకరాల స్థలాన్ని సైతం విక్రయిస్తారు. వీటి కోసం కనీసం 281 కోట్ల రూపాయలతో బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
వర్చువల్ మెడికల్ రిప్రజంటేటివ్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్.. IIL.. సరికొత్త ఆవిష్కరణ చేసింది. వర్చువల్ మెడికల్ రిప్రజంటేటివ్‌ల మాదిరిగా పనిచేసే ఒక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. డాక్టర్లు, మెడికల్ రిప్రజంటేటివ్‌లు సమాచారాన్ని పరస్పరం పంచుకోవటానికి ఇ-మోజ్ పేరుతో మోడ్రన్ టూల్‌ని ప్రవేశపెట్టింది. కొవిడ్ నేపథ్యంలో మెడికల్ రిప్రజంటేటివ్‌లు డాక్టర్లను కలవటం కష్టంగా మారటంతో ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చినట్లు ఐఐఎల్ తెలిపింది. వైద్యులకు కావాల్సిన సమాచారాన్ని ఈ పరికరం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి అందిస్తుంది.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!