Global Economy’s Ray of Hope: అన్ని దేశాల ఆశాకిరణం చైనా.. గ్లోబల్ ఎకానమీని గట్టెక్కించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Economy’s Ray of Hope: చైనా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశం ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోంది. కొవిడ్ జీరో పాలసీకి డిసెంబర్‌లో స్వస్తి చెప్పింది. రెండు నెలల కిందట తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఆర్థికపరంగా పూర్తి స్థాయిలో కుదుటపర్చలేదు. రియల్ ఎస్టేట్, తయారీ, ఎగుమతులు, కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ వంటి రంగాలు ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ సెక్టార్లు మరింత కాలం ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
చైనాలో గతేడాది వివిధ వస్తూత్పత్తులకు గిరాకీ లేకపోవటంతో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. యూరప్ మరియు అమెరికాల్లో కూడా డిమాండ్ మందగించటంతో ఎగుమతులు నేలచూపులు చూశాయి. కొవిడ్ ఎఫెక్ట్ నుంచి చైనా ఎకానమీ క్రమంగా పుంజుకుంటోందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆసియా దేశాల్లో మాత్రం ఇంకా అలాంటి ఆశావహ దృక్పథం కనిపించట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్ లేఆఫ్‌లు
చైనా ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పునఃప్రారంభమైనా.. రాబోయే నెలల్లో ఆసియాలో వృద్ధి మందగించే అవకాశమే ఉందని నొమురా సంస్థ తన నివేదికలో వెల్లడించింది. చైనాలో ఆర్థిక వృద్ధి ముందుగా సేవల రంగంలో నెలకొంటుందని, ఇందులోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని వివరించింది. అయితే.. ఆసియాలో ఎగుమతులు లేదా పారిశ్రామిక రంగ పురోగతి ఈ సంవత్సరంలోని రెండో అర్ధ భాగంలో పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతుందని నోమురా పేర్కొంది.
ఇండియా, చైనా వాణిజ్యం 2022లో ఆల్‌టైమ్ హైలెవల్లో.. అంటే.. దాదాపు 134 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు చైనా కస్టమ్స్ విభాగం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. కానీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ ఆ దేశంతో ఇండియా వాణిజ్య లోటు తొలిసారిగా 100 బిలియన్ డాలర్లను దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
భారతదేశానికి చైనా ఎగుమతులు 118 బిలియన్ డాలర్లకు పైగా జరగ్గా ఇండియా నుంచి చైనాకు జరిగిన ఎగుమతులు కేవలం 17 బిలియన్ డాలర్లే కావటం వల్ల వాణిజ్య లోటు ఈ స్థాయికి పెరిగిపోయింది. చైనా.. జీరో కొవిడ్ పాలసీని సడలించటం వల్ల అభివృద్ది చెందుతున్న మార్కెట్లకు మంచి జరుగుతుందని గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ‘‘ఎస్ అండ్ పీ’’ అంచనా వేసింది.
చైనాలో రాకపోకలు పెరగటం వల్ల తయారీ రంగంలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం లేదని, ఈ పరిణామం.. ఆ దేశంతో అనుసంధానం కలిగిన ఎమర్జింగ్ మార్కెట్లకు అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడింది. అడ్వాన్స్‌డ్ ఎకానమీల్లో డిమాండ్ తగ్గితే చైనాకు ఇలాంటి ప్రయోజనాలు దూరమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే ఆందోళనల నేపథ్యంలో మన దేశ వాణిజ్య వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఊగిసలాటకు గురవుతుందని నిపుణులు తెలిపారు.
గ్లోబల్ ఎకానమీలో పరిస్థితులు గనక మెరుగుపడకపోతే ఇండియా వాణిజ్య రంగంలో ఉత్సాహం కొరవడుతుందని ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే సైతం అభిప్రాయపడింది. గతేడాది భారతదేశ ఎగుమతులు ఆల్‌టైమ్ హైలెవల్లో నమోదైనా ప్రస్తుతం అలాంటి సానుకూల వాతావరణం లేదని, ప్రపంచ వాణిజ్య రంగంలో ఎదురు గాలులు వీస్తున్నాయని ఎకనమిక్ సర్వే తేల్చిచెప్పింది. డిసెంబర్‌లో ఇండియా ఎగుమతులు 12 శాతానికి పైగా పడిపోయాయని సెంట్రల్ గవర్నమెంట్ డేటా చెబుతోంది.
దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా వస్తూత్పత్తులకు డిమాండ్ పడిపోవటమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎగుమతుల విలువ 34 బిలియన్ డాలర్లకు పైగా పతనమైందని, ఫలితంగా ఆ ఒక్క నెలలోనే వాణిజ్య లోటు సుమారు 24 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. ఇదిలాఉండగా.. ఈ ఏడాది అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి తక్కువలో తక్కువగా ఒక శాతం నమోదవుతుందని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్.. WTO.. అంచనా వేసింది.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి