Gautam Gambhir: “సంజూ ఏంటో మాకు తెలుసు”.. వాళ్లకు ఇచ్చిపడేసిన కోచ్ గౌతమ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: నిన్న జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు సంజూ శామ్సన్ వెస్టిండీస్ ప్లేయర్స్‌కు చుక్కలు చూయించాడు. 50 బంతుల్లో ఏకంగా 97 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. అయితే.. మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు పస్తుతం వైరల్‌గా మారాయి. ప్రెస్ మీట్‌లో చెప్పిన మాటలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. చిన్న చిన్న కాంట్రిబ్యూషన్‌లను సైతం గుర్తించడంపై సంతోషం వ్యక్తం చేసిన గంభీర్, చాలా కాలంగా క్రెడిట్ కొద్ది మందికే పరిమితమైందని సూచించారు. విమర్శకులకు ఇచ్చి పారేశాడు.
READ MORE: Sanju Samson Record: సంజు శాంసన్ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
టోర్నమెంట్ ఆరంభంలో సంజూను జట్టులోంచి తప్పించాలని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫామ్‌లో లేడని అందరూ భావించారు. తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై గంభీర్ వివరణ ఇస్తూ.. ఎంతో ఆలోచించి సంజూను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు. “సంజూలో ఎంత సామర్థ్యం ఉందో మాకు తెలుసు. అతని ఖాతాలో మూడు టీ20 సెంచరీలు ఉన్నాయి. ప్రతి ఆటగాడికి చెడు దశ వస్తుంది. అప్పుడప్పుడు ఒత్తిడినుంచి బయటకు తీసుకురావడం అవసరం.” అని గంభీర్ వివరించారు. అవసరమైన సమయంలో అతను ప్రపంచకప్‌లో ప్రభావం చూపుతాడనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆంకెల కంటే అనుభవానికే ఎక్కువ విలువ ఇస్తానని గంభీర్ చెప్పడం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మరో హైలైట్‌గా మారింది. “టీ20 అనేది గణాంకాల ఆట కాదు. అది అర్థం చేసుకునే ఆట, ఆత్మవిశ్వాసం ఉన్న ఆట. నా అనుభవాన్ని కెప్టెన్‌తో పంచుకుంటాను. చివరి నిర్ణయం మాత్రం కెప్టెన్‌దే.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!