Crime: లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి..దొంగతనం కేసులో అరెస్ట్..
- కర్ణాటకాలో ఓ ట్విస్ట్
- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు దొంగగా మారిన వైనం
- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ బార్‌లో డబ్బులు.. మద్యం దొంగిలించి పరారైన ముగ్గురు నిందితులు
- అందులో ఓ వ్యక్తి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తేల్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకాలో ఓ ట్విస్ట్ నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు దొంగగా మారిపోయి చోరీ కేసులో అరెస్టు కావడం కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా రాయపుర గ్రామ సమీపంలో బార్ లో జరిగిన చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి స్వయంగా ఈ చోరీ చేశాడని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల క్రితం చిత్రదుర్గ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ బార్‌లో డబ్బులు, మద్యం దొంగిలించి పరారయ్యారు. బార్‌లో చోరీకి పాల్పడుతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డు అయ్యింది.
READ MORE: Nirmala Sitharaman: ఆర్థికమంత్రి డీప్ ఫేక్ వీడియో కలకలం.. ఎఫ్‌ఐఆర్ నమోదు
Also Read
నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే అంతకు ముందే చిక్కమగళూరులో ఓ కేసులో పోలీసులు ఆ నిందితులను అరెస్టు చేశారు. చిక్కమగళూరు జైలులో ఉన్న రఘుకుమార్, హాసన్‌కు చెందిన దర్శన్, జగదీష్‌ల బాడీ వారెంట్ మీద చిత్రదుర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు చాలా ఏళ్లుగా చిత్రదుర్గ, దావణగెరె, తుమకూరు, చిక్కమగళూరు జిల్లాల్లో దొంగతనాలు, చోరీలు, లూటీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో చిత్రదుర్గలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘుకుమార్‌కు 2,337 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు అదే రఘుకుమార్ దొంగతనాలు చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి రెండు వేలకు పైగా ఓట్లు సంపాధించడం సామాన్యమైన విషయం కాదని, ఇప్పుడు ఇలా చోరీల కేసుల్లో చిక్కుకోవడం మాకే షాక్ గా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు