అసెంబ్లీ చర్చలకి రాని దద్దమ్మలు 4గంటలు మీడియాలో కూర్చున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతం అంటున్నాడని.. కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడుదం రా.. అని సవాల్ విసిరారు.
నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటింటికీ తిరుగుతూ మళ్లీ తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్నారు. మరో వైపు ధర్మపురి సంజయ్ అరవింద్ పై విరుచుకు పడుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి తాను ఒక్కడే తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటారని.. అది పచ్చి అబద్ధమన్న విషయం ప్రజలందరికీ తెలుసని కోదండ రామ్ అన్నారు. కాజిపేట్, మడికొండలో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. కడియం కావ్యకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
రాముల వారి పై ఒట్టేసి ఇచ్చిన హామీలు.. ఏ ఏడాది ఆగస్టున నెరవేస్తారో చెప్పాలని మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటల కే గ్యారెంటీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మానుకోట సభ దానికి నిదర్శనమన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు.. కాబట్టి మీ సభలకు దిక్కు దివాన లేదన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అహంకారన్ని దించాలంటే చురుక్కు పెట్టాల్సిందే అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మేడలు వంచుతామన్నారు.
కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు మే 6 కు రిజర్వ్ చేసింది. ఈడీ తరపున జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపు న్యాయవాది నితీష్ రానా ఈడీ వాదనలపై ఎల్లుండి లిఖితపూర్వకంగా తమ రిజాయిండర్ ఇస్తామని కోర్టుకు తెలిపారు.
మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జలదంకి మండలంలోని గట్టుపల్లిలో టీడీపీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడపగడపకు తిరుగుతూ సౌమ్యుడు, స్నేహ శీలి, ప్రజాసేవకులు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి కాకర్ల సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్రంపై విరుచుకు పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ సీటు తనకే కావాలని పట్టుపట్టడంతో నేతలు దిగివచ్చారు. అతడితో ఎన్నిమంతనాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.