America: అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ల అరెస్ట్.. మనుషుల అక్రమ రవాణా కేసు
- నలుగురు తెలుగు వాళ్లని అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు
- అందులో భార్యభర్తలు కూడా ఉన్నట్లు గుర్తింపు
- ఆ దేశ చట్టాల ప్రకారం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు
- మనుషుల అక్రమ రవాణా.. కంపెనీల్లో వెట్టిచాకిరి చేయిస్తోన్నారంటూ ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషుల అక్రమ రవాణా కేసులో అమెరికాలోని టెక్సాస్ పోలీసులు నలుగురు తెలుగు వాళ్లని అరెస్ట్ చేశారు. అందులో భార్యభర్తలు కూడా ఉన్నారు. ఆ దేశ చట్టాల ప్రకారం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ నలుగురూ- చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలెగా పోలీసులు నిర్ధారించారు. వారిలో సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా భార్యభర్తలు. టెక్సాస్‌లోని ప్రిన్స్‌టన్ కొలిన్ కంట్రీలో వాళ్లు నివసిస్తోన్నారు. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడటం, నిర్బంధించి తమ కంపెనీల్లో వెట్టిచాకిరి చేయిస్తోన్నారంటూ ఫిర్యాదులు అందాయి. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కొలిన్ కంట్రీ గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఓ ఇంట్లో 15 మంది మహిళలు ఒకే గదిలో నివసిస్తోన్నారని, వారి అత్యంత దయనీయంగా ఉందంటూ పెస్ట్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ప్రిన్స్‌టన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ 15 మంది బాధితుకు విముక్తి కల్పించారు.
READ MORE: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
Also Read
దీంతో పాటు ఆ ఇంట్లో కంప్యూటర్, కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు, బ్లాంకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఫర్నిచర్ కూడా ఆ ఇంట్లో లేకపోవడం, ఆ ఇళ్లు కూడా అంతమంది నివసించడానికి అనుకూలంగా లేకపోవడం.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు నిదర్శనంగా గుర్తించారు. వారిని చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలె బలవంతంగా నిర్బంధించినట్లు నిర్ధారించారు. కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని ఆశపెట్టి వారిని అమెరికాకు తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అవన్నీ కూడా డొల్ల కంపెనీలేనని వెల్లడించారు. ప్రిన్స్‌టన్‌తో పాటు మెలిస్సా, మెక్‌కెన్నీ ప్రాంతాల్లోనూ ఈ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!