ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ.. ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. జమ్మూ ప్రాంతంలో నెల వ్యవధిలో జరిగిన ఐదు పెద్ద ఉగ్ర దాడులు ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. ఒక నెల క్రితం రియాసిలో బస్సుపై ఉగ్రవాదుల దాడి జరిగింది. కథువాలో గత కొన్ని రోజులుగా ఉగ్ర దాడులు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. పలువురు జావాన్లు కూడా వీరమరణం పొందారు. తాజాగా సోమవారం కథువాలో మచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై దాడి జరిగింది. ఇక్కడ ఉగ్రవాదులు సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్న సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్లను లాబ్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా.. పలువురు గాయపడ్డారు.
READ MORE: CM Nitish Kumar: అధికారి కాళ్లు పట్టుకోబోయిన సీఎం నితీష్ కుమార్.. వీడియో వైరల్..
ఉగ్రవాదులు ఇంత సైలెంట్‌గా ఈ ప్లాన్‌లు చేపడుతున్నారంటే.. నిఘా వర్గాలు కూడా ప్లాన్ లను తెలుసుకోలేకపోతున్నారు. అయితే.. జమ్మూ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఉన్న తమ మాస్టర్స్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారు. దాని కోసం ఉగ్రవాదులు హైబ్రిడ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇటీవల సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఆర్మీ అటువంటి అల్ట్రాసాట్ సిస్టమ్‌లను కనుగొంది. వీటిని ఉపయోగించుకుని ఉగ్రవాదులు పక్కా ప్రణాళికలు వేసి జమ్మూలో దాడులకు పాల్పడ్డారు.
READ MORE: Sathya in Narsaraopet: సత్యా 24వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!
వాస్తవానికి.. అల్ట్రాశాట్ హ్యాండ్‌సెట్‌లు.. హైబ్రిడ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లను ఏకీకృతం చేస్తాయి. ఇవి సెల్యులార్ టెక్నాలజీని ప్రత్యేక రేడియో పరికరాలతో మిళితం చేస్తాయి. ఈ పరికరాలు GSM లేదా CDMA వంటి మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి సొంతంగా సమచారాన్ని అందిస్తాయి. అలాగే అక్కడి నుంచి సమాచారాన్ని స్వీకరిస్తాయి. దీనికి సాధారణ మొబైల్ నెట్ వర్క్ తో సంబంధం ఉండదు. ప్రతి అల్ట్రాసాట్ సరిహద్దు వెంబడి ఉన్న కంట్రోల్ స్టేషన్‌కు కనెక్ట్ చేయబడింది. నేరుగా హ్యాండ్‌సెట్ నుంచి హ్యాండ్‌సెట్ కమ్యూనికేషన్‌లకు మద్దతు ఇవ్వదు. బదులుగా.. వారు హ్యాండ్‌సెట్‌ల నుంచి పాక్ లోని సెంట్రల్ సర్వర్‌కు కంప్రెస్డ్ డేటాను ప్రసారం చేయడానికి చైనా ఉపగ్రహాలపై ఆధారపడుతున్నారు. ఉగ్రవాదులు పంపిన సమాచారం గురించి తెలుసుకోవడం భారత ఆర్మీకి సాధ్యపడదు. ఉగ్రవాదులు వినియోగిస్తున్న టెక్నాలజీ పెద్ద అడ్డంకిగా మారడంతోపాటు సైన్యంపై భీకర దాడులు జరగడానికి ఇదే కారణమవుతోంది.