World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World’s First Motorcycle: ఈరోజుల్లో యూత్‌కి బైక్ అంటే ఒక కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. నిజానికి కోట్లాది మందికి వారి బైక్స్ అంటే ప్రత్యేకమైన ప్రేమ, అలాగే వాటితో వారి జీవితాల్లో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ప్రతి రోజూ బైక్‌లపై ఉద్యోగాలకు వెళ్లడం నుంచి సుదూర ప్రయాణాల వరకు వాటిపైనే ఆధారపడుతున్నాం. కానీ ప్రపంచాన్ని మార్చేసిన ఈ బైక్ ఎలా పుట్టింది? మొదట దీన్ని ఎవరు తయారు చేశారు? సైకిల్‌కు చిన్న ఆవిరి ఇంజిన్‌ను అమర్చిన ప్రయోగం ఎలా ఆధునిక బైక్‌లకు నాంది పలికింది? 160 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మోటార్‌సైకిల్ ఆవిర్భావం వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు కథ ఇదే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న మోటార్‌సైకిల్‌కు దాదాపు 160 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నేటి అత్యాధునిక బైక్‌లకు పునాది 19వ శతాబ్దంలో పడింది. అయితే మోటార్‌సైకిల్‌ను ఒక్క వ్యక్తి కనిపెట్టలేదని, యూరప్‌కు చెందిన పలువురు ఇంజినీర్లు, ఆవిష్కర్తల కృషి ఫలితంగానే ఇది రూపుదిద్దుకుందని చరిత్ర చెబుతోంది. మోటార్‌సైకిల్ చరిత్ర 1860లలో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. ఆ కాలంలో ముందు, వెనుక చక్రాలు సమాన పరిమాణంలో ఉండే “సేఫ్టీ సైకిల్”ను ఆధారంగా తీసుకుని కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. పారిస్‌కు చెందిన కమ్మరి పియరీ మిచాక్స్ స్థాపించిన “మిచాక్స్ ఎట్ సి” సంస్థ పెడల్స్‌తో కూడిన సైకిళ్లను తయారు చేసింది. అనంతరం ఆయన కుమారుడు ఎర్నెస్ట్ మిచాక్స్ ఒక సైకిల్‌కు చిన్న ఆవిరి ఇంజిన్ అమర్చి, 1867లో తొలి ఆవిరి శక్తితో నడిచే మోటార్‌సైకిల్‌ను తయారు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇదే సమయంలో మిచాక్స్ సంస్థలో పనిచేసిన పియరీ లాలెమెంట్ కూడా సైకిల్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1866లో అమెరికాలో తొలి సైకిల్ పేటెంట్ కోసం దరఖాస్తు చేయడం ద్వారా సైకిల్ అభివృద్ధికి మరో మైలురాయి వేశారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
1868లో అమెరికన్ ఆవిష్కర్త సిల్వెస్టర్ హెచ్.రోపర్ రెండు సిలిండర్లతో పనిచేసే ఆవిరి ఇంజిన్‌ను సైకిల్‌కు అమర్చి మరో వినూత్న నమూనాను రూపొందించారు. అదే ఏడాది ఫ్రెంచ్ ఇంజనీర్ లూయిస్-గిల్లౌమ్ పెర్రెక్స్ కూడా ఆవిరితో నడిచే సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్‌కు పేటెంట్ పొందారు. వీరి ఆవిష్కరణలు మోటార్‌సైకిల్ అభివృద్ధిలో కీలక మలుపుగా నిలిచాయి. తర్వాతి దశలో అమెరికాకు చెందిన లూసియస్ కోప్‌ల్యాండ్ మరింత చిన్న పరిమాణంలో ఆవిరి బాయిలర్‌ను రూపొందించి గంటకు సుమారు 12 మైళ్ల వేగంతో ప్రయాణించే వాహనాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం 1887లో ఆయన స్థాపించిన నార్త్రోప్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా తొలి సక్సెస్ఫుల్ మోటార్ వాహనాల్లో ఒకటైన మూడు చక్రాల “మోటో-సైకిల్”ను తయారు చేశారు. ఈ విధంగా సైకిల్‌పై చేసిన చిన్న చిన్న ప్రయోగాలతో ప్రారంభమైన ప్రయాణం… నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే అత్యాధునిక బైక్‌ల తయారీకి బలమైన పునాదిగా నిలిచింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!