Emergency movie: కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ ఎప్పుడంటే?
- కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకు గ్రీన్ సిగ్నల్
- గతంలో సినిమాపై సిక్కులు అభ్యంతరం
- తాజాగా సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్
- ఎక్స్ పోస్ట్‌లో తెలిపిన నటి కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది. అయితే ఇప్పుడు విడుదలకు చిక్కుముళ్లు వీడాయి. తాజాగా తన సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొందిందని నటి తెలియజేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను పంచుకుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. మీ సహనం, మద్దతుకు కృతజ్ఞురాలినని పోస్ట్‌లో పేర్కొంది.
READ MORE: Bhakthi TV Koti Deepotsavam 2024 : భక్తి టీవీ కోటి దీపోత్సవం.. నవంబర్ 9 నుంచి 25 వరకు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఎమర్జెన్సీపై వివాదం ఏమిటి?
కంగనా చిత్రం ముందుగా 2024 సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. అయితే సిక్కు సంస్థల నిరసనలతో విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో తమ సమాజం గురించి తప్పుగా చూయించారని.. సిక్కులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 14న విడుదలైంది. అప్పటి నుంచి సినిమాపై వివాదం తలెత్తింది. పంజాబ్‌లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు. సీబీఎఫ్‌సీ ఇంతకుముందు సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ సిక్కు సంఘం యొక్క ఆగ్రహం తెరపైకి రావడంతో ఈ వివాదం.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మేకర్స్కు ఇంకా సర్టిఫికేట్ నిలిపేసింది. సర్టిఫికేట్ ఇచ్చే ముందు సిక్కుల అభ్యంతరాలపై దృష్టి పెట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్‌సీని ఆదేశించింది.
కంగనా సినిమాలో మార్పులు..
సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో మేకర్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది చిత్రంలో కంగనాకు మార్పులను సూచించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పాస్ కావడానికి షరతులు పెట్టినట్లు సమాచారం. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో మార్పులు చేయాలని మేకర్స్‌ని ఆదేశించారు. చారిత్రక అంశాలపై డిస్‌క్లైమర్లు పెట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఎమర్జెన్సీ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. నటనతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి వంటి పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!