ఢిల్లీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విభవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు.
సీఎం హౌస్‌లో రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో నిందితుడు విభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ సీఎం హౌస్ నుండి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇప్పుడు విభవ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున మరోసారి ఖర్గె ఫైరయ్యారు. మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ " కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లు పంపుతారు" అని వ్యాఖ్యానించారు.
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.
రాహుల్ గాంధీపై సుశీల్ మోడీ ‘మోడీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సుశీల్ మోడీ మృతి చెందారు. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్తోందనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది
ఓ వైపు స్వాతి మలివాల్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు.
మ్యూచువల్ ఫండ్ లో డబ్బును ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. కేవైసీ (KYC) నమోదు చేయడంలో సమస్యతో పోరాడుతున్న వారికి ఉపశమనం కలిగించింది.
తైవాన్ పార్లమెంట్లో శుక్రవారం ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాటకు దారితీసింది. కొన్ని చట్టాల్లో మార్పులపై వాడివేడిగా చర్చ జరుగుతుండగా.. ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.