కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానిక, విదేశీ విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కిర్గిస్థాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. మే 13న కిర్గిజ్ విద్యార్థులు, ఈజిప్టు వైద్య విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
తీహార్ జైల్లో తోటి ఖైదీని క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్య చేసిన కేసులో నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. మూడేళ్ల నాటి ఈ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఎంపీ స్వాతి మలివాల్‌ను కొట్టిన కేసు ఇప్పుడు ఊపందుకుంది. అంతకుముందు స్వాతితో బిభవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించాడని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించగా.. శుక్రవారం ఆప్ యూటర్న్ తీసుకుంది.
రిషి సునాక్ పేరు అందరికీ సుపరిచితమే. భారత సంతతికి చెందిన అతడు బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతున్నారు. తాజాగా అతడు మరోసారి వార్తల్లోకెక్కారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి మరింత సంపన్నులు అయ్యారు.
భారతీయ విద్యార్థులకు ఇష్టపడే గమ్యస్థానాల్లో కెనడా ఒకటి. ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) డేటా ప్రకారం.. కెనడాలోని మొత్తం 226,450 మంది భారతీయులు ఉన్నారు. ప్రతి 10 మంది విదేశీయుల్లో నలుగురు భారతీయులే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మనీలాండరింగ్ కేసును ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సమన్లు జారీ చేసినా కూడా నిందితుడిని అరెస్టు చేయాలంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్ ముగిసింది. మరోసారి అధికారాన్ని సొంత చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థల పేర్లు తరచూ వినబడుతుంటాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి విభవ్ కుమార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో కేవలం విభవ్‌ను మాత్రమే నిందితుడిగా చేర్చారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు దశల ఎన్నికలు ముగిశాయి. అదే సమయంలో అన్ని పార్టీలు రాబోయే 3 దశల ప్రచారంలో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌తో సీఎం నివాసంలో జరిగిన గొడవ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.