TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Donations: శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో చివరి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. ఒక్కరోజులోనే సుమారు రూ.97 కోట్ల విరాళాలు నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ వివరాల ప్రకారం, ఆన్లైన్ ద్వారా 2,354 మంది భక్తులు రూ.87.34 కోట్లను విరాళంగా అందించగా, ఆఫ్‌లైన్ ద్వారా 106 మంది మరో రూ.9.63 కోట్లను సమర్పించారు. దీంతో ఒక్కరోజులోనే మొత్తం రూ.97 కోట్లకు పైగా విరాళాలు టీటీడీ ట్రస్టులకు చేరాయి. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనల మార్పు నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున విరాళాలు అందించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ (Rationalization) కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించిన విషయం విదితమే.. ఈ కొత్త విధానం 14వ తేదీన అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది.. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
కొత్త పాలసీతో వచ్చే మార్పులు ఏంటి..?
ఇక, కొత్త పాలసీ ప్రకారం రూ.10 లక్షలు విరాళంగా అందించిన భక్తులకు గతంలో సంవత్సరానికి మూడు సార్లు లభించే బ్రేక్ దర్శనాన్ని ఇకపై సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కల్పించనున్నారు. అదనంగా మరోసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే వ్యక్తిగతంగా విరాళాలు అందించిన దాతలకు ఇప్పటివరకు ఉన్న జీవితకాల ప్రివిలేజెస్‌ను ఇకపై 20 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. కొత్త డోనర్ పాలసీని అమల్లోకి రాకముందే.. పాత పద్ధతుల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో.. భక్తులు ఒకే రోజు పెద్ద మొత్తంలో శ్రీవారికి విరాళాలు సమర్పించారు..
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!