రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటిబడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. క్రీడలకు ఆదరణ తగ్గించారని.. క్రీడలు అభివృద్ధికి రాజమండ్రి నుంచి నాంది పలుకుతాని పేర్కొన్నారు.
ఒడిశాలోని పూరిలో అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. పూరీ నుంచి రిషికేశ్ వెళ్తున్న ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్యాంటీకార్ ఉద్యోగి దివ్యాంగ మహిళపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.
కోల్‌కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మరణించిన రోజున ఓ జూనియర్ డాక్టర్ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్రూమ్లో స్నానం చేసినట్లు వెల్లడించింది.
ఓ వైపు యూపీలో తోడేళ్లు జనజీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. వాటి దాడిలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.