టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16ని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది.
తమిళ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా అడ్డు వచ్చిన బైక్ ని తప్పించడానికి ప్రయత్నించడంతో కారు ప్రమాదానికి గురై అక్కడున్న బారికేడ్ ని గుద్దింది.
కర్ణాటకలోని కలబురగిలో నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. హుమ్నాబాద్ రోడ్డులోని బైక్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో భారీ నష్టం వాటిల్లింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అంశం వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. కొన్ని వీడియోలు చూస్తే.. వాస్తవమా ? కాదా అనేది నమ్మడం కష్టంగా మారుతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది పాకిస్తాన్‌కు చెందినది అని చెబుతున్నారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి తలపై సీసీటీవీ కెమెరాను పెట్టుకుని కనిపించింది.
కనీవిని ఎరుగని రీతిలో బుడమేరుకు వచ్చిన వరద.. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలను అతలాకుతలం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 7రోజులుగా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. రోగిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.