Supreme Court: నేడు సుప్రీంకోర్టులో పిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. తెలంగాణ స్పీకర్‌పై బీఆర్ఎస్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31 న ఆదేశాలిచ్చింది దేశ అత్యున్నత ధర్మాసనం..
India vs Pakistan Cricketers Fight: ఏ క్రీడలోనైనా భారతదేశం vs పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి. క్రికెట్లో ఇరు దేశాల మధ్య మాచ్ హీట్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మ్యాచ్ ఏదో ఒక సమయంలో వివాదాలకు కారణమవుతుంది. రెండు ఆసియా దేశాల మధ్య చాలా కాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పహల్గాం దాడి తరువాత భారత్ vs పాక్ మ్యాచ్‌లు తీవ్రం రూపాన్ని దాల్చాయి. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లలో అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి.…
Winter Health Tips for Children చలికాలం మొదలైంది. రాత్రి, ఉదయం వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. చిన్న పిల్లలకు కష్టంగా మారుతుంది. పెద్దలు కొంతవరకు చలిని తట్టుకోగలిగినా, పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉండటంతో తక్షణమే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు చలి ప్రభావం మరింతగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.
Telangana Cotton Millers Strike: తెలంగాణ రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ కానున్నాయి.. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిరవదికంగా నిలిపేసింది. L1,L2,L3 సమస్యను పరిష్కరించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని సమ్మె నిర్వహిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కొనుగోళ్లు నిలిపివేయడంతో వ్యవసాయ మార్కెట్లో ఎక్కడికక్కడే…
Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Telangana Cold Wave: రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చలి పులి బేంబెలెత్తిస్తోంది. రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ చలి తీవ్రత అంతకంతకూ పెరిగింది. 11 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి నుంచి రక్షణ…
Bihar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 243 మంది సభ్యులు గల అసెంబ్లీలో 202 స్థానాలను గెలుచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అఖండ మెజారిటీని సాధించింది. నూతన ప్రభుత్వం, మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ పార్టీల మధ్య ఢిల్లీ, పాట్నాలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ, ఎన్నికల కమిషన్ బృందం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పూర్తి జాబితాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు సమర్పించింది.
Cracked Heels Home Remedies: చలికాలం మొదలైతే చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడే సమస్య మడమల పగుళ్లు. చర్మం పొడిగా మారటం, తేమ తగ్గిపోవడం, వయసుతో చర్మం పలచబడటం మరిన్ని ఇతర కారణాలతో మడమలు గట్టిపడి పగుళ్లు పడతాయి. కొందరికి అయితే రక్తం వచ్చేంతగా పగుళ్లు తీవ్రమవుతాయి. నొప్పి, కాలుతున్నట్టుగా అనిపించడం, నడవడానికే ఇబ్బంది పడటం ఇలా అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తలు, ఇంట్లోనే చేసే చిన్న రెమెడీలతో ఈ సమస్యను సులభంగా నియంత్రించుకోవచ్చు.
Best Foods for Liver: లివర్ ఆరోగ్యం బాగుంటేనే మన శరీరం సరిగా పనిచేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడం, టాక్సిన్స్‌ను తొలగించడం, ఆహారం అరిగేలా చేయడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా ఎన్నో కీలక పనులు లివర్ చేస్తుంది. కానీ నేటి జీవన విధానం, ప్రాసెస్డ్ ఫుడ్, ఒత్తిడి, కాలుష్యం, అలవాట్లలో పొరపాట్లు వల్ల లివర్‌పై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో లివర్‌ను రక్షించుకోవడానికి ఆహారమే పెద్ద ఆయుధమని నిపుణులు చెబుతున్నారు.
Hyderabad: నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ పంజా విసిరింది.. ఓనర్ ఇంట్లో లేని సమయం చూసి పక్కా స్కెచ్ వేసింది.. మరో నలుగురి సహాయంతో దోపిడీకి ప్లాన్ చేసింది. ఫంక్షన్ నుంచి ఓనర్ ఇంటికి రాగానే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చే ప్రయత్నం చేసింది.. జ్యూస్ తాగి ఓనర్ స్పృహ కోల్పోగానే ఇళ్లు మొత్తం దోచేసింది. 23 లక్షల రూపాయలు, 25 తులాల బంగారంతో ఉండాయించింది. ఈ ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.