డిజైన్, పవర్‌లో ఫార్చ్యునర్‌కు ఫుల్ ఛాలెంజ్.. MG Majestor టీజర్ రిలీజ్.. లాంఛ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Majestor SUV: టయోటా ఫార్చ్యునర్‌కి పోటీగా ఓ కొత్త ఎస్‌యూవీ రంగంలోకి దిగనుంది. భారత మార్కెట్‌లోకి మరో భారీ ఎస్‌యూవీ రావడానికి సిద్ధమవుతోంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ కొత్త ఎస్‌యూవీ ‘మజెస్టర్’ను ఫిబ్రవరి 12, 2026న అధికారికంగా పరిచయం చేయనుంది. ఇప్పటికే ఆటో ఎక్స్‌పో 2025లో ఇది మొదటిసారి చూపించగా, ఇప్పుడు దాని మీద ఆసక్తిని పెంచేందుకు ఎంజీ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అనంతరం.. కంపెనీ లైనప్‌లో టాప్ మోడల్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గ్లోస్టర్ స్థానాన్ని మజెస్టర్ తీసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్లలో ముందు భాగం, సైడ్ ప్రొఫైల్ మాత్రమే కనిపించాయి. తాజాగా వచ్చిన టీజర్‌లో మాత్రం మజెస్టర్ వెనుక భాగాన్ని చూపించారు. ఈ ఎస్‌యూవీ డిజైన్ విషయంలో ఎంజీ ఎలాంటి రాజీ పడలేదని అర్థమవుతోంది. కంపెనీ మాటల్లో చెప్పాలంటే, మజెస్టర్ ఇప్పటివరకు ఎంజీ తీసుకువచ్చిన కార్లలోనే భారీ ఆకారం కలిగిన ఎస్‌యూవీగా చెబుతున్నారు.
READ MORE: Indian Rupee: వాణిజ్య డీల్ ఎఫెక్ట్.. రూపాయికి మంచి రోజులు!
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ముందు భాగం చాలా బోల్డ్‌గా కనిపిస్తుంది. మ్యాట్రిక్స్ స్టైల్ గ్రిల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దాని చుట్టూ అడ్డంగా, నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ ఆకర్శనీయంగా ఉన్నాయి. పక్క నుంచి చూస్తే 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, బయటకు ఉబ్బిన వీల్ ఆర్చ్‌లు కారుకు మంచి భారీ ఆకారాన్ని ఇస్తాయి. రోడ్డుపై కి ఎంట్రీ ఇస్తే లుక్కు మామూలుగా ఉండదు. వెనుక భాగంలోనూ ఆకట్టుకునే డిజైన్ ఉంది. టెయిల్ ల్యాంప్‌లలో పిక్సెల్ స్టైల్ డిజైన్ కనిపిస్తుంది. మధ్యలో పెద్దగా ‘మజెస్టర్’ బ్యాడ్జ్ పెట్టారు. కింద భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన బలమైన బంపర్ ఉంది. మొత్తం వెనుక డిజైన్ చూస్తే, ఇది నిజంగానే ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అన్న ఫీలింగ్ ఇస్తుంది. లోపల మజెస్టర్ ఒక ప్రీమియం అనుభూతిని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో రెండు 12.3 అంగుళాల పెద్ద స్క్రీన్లు ఉండవచ్చని చెబుతున్నారు. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తాయని అంటున్నారు. ఈ సెటప్ వల్ల డ్రైవర్‌కు కావాల్సిన సమాచారం స్పష్టంగా, సులభంగా కనిపిస్తుంది. రోజువారీ ఉపయోగానికి ఉపయోగపడే ఎన్నో ఫీచర్లను ఇందులో ఇవ్వనున్నారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: అధిక ధరలకు మద్యం విక్రయాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్
వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, చుట్టూ ఉన్న దృశ్యాలను చూపించే 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ లాంటి సౌకర్యాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం గ్లోస్టర్‌లో ఉన్న అదే 2.0 లీటర్ డీజిల్ ట్విన్ టర్బో ఇంజిన్‌ను మజెస్టర్‌లోనూ ఉపయోగించనున్నారు. ఈ ఇంజిన్ 212.5 బీహెచ్‌పీ శక్తిని, 478.5 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయనున్నారు. రియర్ వీల్ డ్రైవ్‌తో పాటు, అవసరమైతే ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తంగా చూస్తే, ఎంజీ మజెస్టర్ కేవలం మరో ఎస్‌యూవీగా కాకుండా, బ్రాండ్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే మోడల్‌లా కనిపిస్తోంది. డిజైన్, సైజ్, ఫీచర్ల విషయంలో ఫార్చ్యునర్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?