Supreme Court: తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.
MLA Hussain: సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే తనకు కాల్ చేశాడన్నారు. మోహదీపట్నంలో బాధిత కుటుంబాలను కలిశాన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు.
CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జానార్ తెలిపారు.. రవిది విశాఖపట్నం.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని చెప్పారు.. పాన్‌కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉందన్నారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవికి ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్ లాంటి ఎన్నో దేశాలు తిరిగాడన్నారు.. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టినట్లు వెల్లడించారు..…
CP Sajjanar: ఐ-బొమ్మ ఇమ్మడి రవి టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు.. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాడని స్పష్టం చేశారు. తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ ప్రసంగించారు. ఐ బొమ్మ సైట్‌ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడని తెలిపారు. One win,…
CP Sajjanar: ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు.. సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌తో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు.. ఐ-బొమ్మ అంశంపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మక్కాకు వెళ్లిన బస్సు దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల విభాగం సైతం ఈ ఘటనపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ రోజు టాలీవుడ్‌కు చెందిన చాలా ముఖ్యమైన…
Saudi Bus Accident: సౌదీ రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు హైదరాబాదీలు సజీవదహనమయ్యారు.. మొదటి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు..
Saudi Bus Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్‌కు సంబంధించిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం..ఈ పదహారు మంది హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన వారిగా తెలిసింది. మృతులను రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం,…
Saudi Bus Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంప్రదింపులు జరిపారు.
Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండిన బస్సు బదర్- మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని నిముషాల్లోనే మొత్తం బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ భయానక ప్రమాదంలో 42 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు.
IBomma Ravi: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి అంశంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి గెట్టింగ్ అప్, ER ఇన్ఫోటెక్ కంపెనీలకు CEOగా ఉన్నట్లు తెలిసింది. తన టీంతో కలిసి UK నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ముంబైలో MBA పూర్తి చేశాడు.. లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే భార్యతో విడిపోయాడు. కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాలో నివాసం ఉంటున్నాడు.. VPNతో లొకేషన్లు మారుస్తూ.. వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేశాడు..