Hyderabad IT Raids: హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తాహౌస్, మేహిఫిల్, షాగ్‌హౌస్ హోటల్స్, యజమానుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ హోటల్స్ ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ లలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నిన్న ఉదయం 6 గంటలకు ప్రధాన కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్స్‌లలో ఐటీ తనిఖీలు నిర్వహించారు..
Khawaja Asif: పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి భయంతో వణుకుతోంది. భారత్ మళ్ళీ పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా పేర్కొ్న్నారు. భారత ఆర్మీ చీఫ్ ప్రకటనను తోసిపుచ్చలేమని ఖవాజా ఆసిఫ్ అన్నారు. భారత్ మరోసారి సరిహద్దు దాటి దాడి చేయవచ్చని జోష్యం చెప్పారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ...
Maoist Hidma: నిన్న(మంగళవారం) ఏపీ పోలీసుల చేతిలో హతమైన హిడ్మా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లో ఉన్న ఒక జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని నవంబర్ 10న జర్నలిస్ట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. "ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు…
TSPSC Group-2: పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015–16 సంవత్సరాల్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Adilabad: యువతలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరికొన్ని సార్లు చట్ట విరుద్ధ పనులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ఏకంగా పోలీస్ వాహనాలతోనే రీల్స్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. పోలీసు పెట్రోలింగ్ వాహనంతో.. రీల్స్ చేయడం ఏంటి? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
Indiramma Saree: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక బహుమతిగా కోటి ఇందిరమ్మ చీరలను అందజేయడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంగళవారం మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు దశల్లో చేపడుతోంది. మొదటి దశలో బుధవారం నుంచి డిసెంబర్ 9వ…
Dhurandhar Trailer: బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ధురంధర్'. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.
Sabarmati Central Jail: గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కీలక వార్తలు వెలువడ్డాయి. రిసిన్ పాయిజన్‌తో ప్రజలను హత్య చేయడానికి కుట్ర పన్నిన హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను తోటి ఖైదీలు చితకబాదారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)తో సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్‌పై జైలు లోపల దాడి జరిగింది. హై సెక్యూరిటీ సెల్లో బంధించినప్పటికీ ఇతర ఖైదీలు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
Donald Trump: అమెరికా నిఘా నివేదికను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో జమాల్ ఖషోగ్గి హత్యపై తన సొంత నిఘా సంస్థల నివేదికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. 2018లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య గురించి క్రౌన్ ప్రిన్స్‌కు ఏమీ తెలియదని ట్రంప్ నొక్కి చెప్పారు. 2018 హత్యకు సంబంధించి ABC న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. "మీరు నకిలీ వార్తలు ప్రసారం చేయకండి...…
Mahesh Kumar Goud: బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.. ఓట్ చోరీ నీ నిరసిస్తూ గాంధీ భవన్ ముందు యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలన్నారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్ని చైతన్య వంతం చేసే విధముగా ఉందని కొనియాడారు.