Sanjay Dutt: సంజయ్ దత్ కోసం పాక్ అభిమాని లక్షల విలువైన కానుకలు.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ కావాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Dutt: బాలీవుడ్ ‘ఖల్ నాయక్’ సంజయ్ దత్ క్రేజ్ సరిహద్దులు దాటింది. కేవలం భారతదేశంలోనే కాకుండా, పాకిస్థాన్‌లో కూడా ఆయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. తాజాగా, పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్ కాశిఫ్ జమీర్, దుబాయ్‌లో సంజయ్ దత్‌ను కలిసి ఖరీదైన బహుమతులతో ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ ALSO: CM Chandrababu: క్షేత్రస్థాయిలో పనిచేయండి.. మంత్రులకు సీఎం ఆదేశాలు..
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ఏమిటా బహుమతులు?
దుబాయ్ పర్యటనలో ఉన్న సంజయ్ దత్‌ను కలిసిన కాశిఫ్ జమీర్, తన అభిమానాన్ని చాటుకుంటూ అత్యంత విలాసవంతమైన కానుకలను అందజేశారు.
21 క్యారెట్ల గోల్డ్ వాచ్: స్పానిష్ వోల్ఫ్ లెదర్‌తో తయారైన ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ విలువ దాదాపు $13,000 (సుమారు రూ.12 లక్షలు) ఉంటుందని అంచనా.
కస్టమైజ్డ్ గోల్డ్ ఐఫోన్ 17: ప్రత్యేకంగా రూపొందించిన ఈ బంగారు పూత పూసిన ఐఫోన్ వెనుక భాగంలో సంజయ్ దత్, అతని తల్లిదండ్రులు (సునీల్ దత్, నర్గీస్) ఫోటోలను ముద్రించడం విశేషం.
నగల సెట్: సంజయ్ దత్ భార్య మాన్యత కోసం ఒక ప్రత్యేకమైన జ్యువెలరీ సెట్‌ను కూడా కాశిఫ్ బహుకరించారు.
అభిమాని చూపించిన ఈ ప్రేమాభిమానాలకు సంజయ్ దత్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ బహుమతులను సంతోషంగా స్వీకరిస్తూ కాశిఫ్‌తో సరదాగా గడిపారు.
గతంలో రూ.72 కోట్ల ఆస్తి వీలునామా!
సంజయ్ దత్ పట్ల అభిమానులు ఇలాంటి పిచ్చి ప్రేమను చూపించడం ఇదే మొదటిసారి కాదు. 2018లో ఒక అభిమాని తన మరణానికి ముందు తన రూ.72 కోట్ల విలువైన ఆస్తిని సంజయ్ దత్ పేరు మీద రాశారు. అయితే, ఆ విషయం తెలుసుకున్న నటుడు మానవత్వంతో ఆ ఆస్తిని తిరిగి సదరు అభిమాని కుటుంబానికే ఇచ్చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ప్రస్తుతం సంజయ్ దత్ తన తదుపరి చిత్రం “ధురంధర్: ది రివెంజ్” పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన ఎస్పీ చౌదరి అస్లాం అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
READ ALSO: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!