Dhurandhar 2 Teaser: ఫ్యాన్స్ అసహనం.. ధురంధర్ 2 టీజర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2 Teaser: తాజాగా రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 టీజర్ విడదలైంది. ఇక ఈ టీజర్‌పై ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా ఉండవు. “ఇంకీ ఏం చూయిస్తారు?”, “హమ్జా పాత్ర ఎలా ముందుకు వెళ్తుంది?” అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక ఆ ఉత్సాహం కాస్త నిరాశగా మారిపోయిందని కొందరు భావిస్తున్నారు. టీజర్ చూసిన చాలా మంది ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా కోపం వచ్చిందట. టీజర్ వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలెట్టేశారు. టీజర్‌లో కొత్తగా ఏం కనిపించలేదుని చెబుతున్నారు. హమ్జా ఎలా ఎదుగుతాడు? అతడికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? జస్కీరత్ సింగ్ రంగీ నుంచి హమ్జాగా ఎలా మారాడు? ఇవన్నీ ఇప్పటికే మొదటి భాగం చివర్లోనే చూపించారు. ధురంధర్ పార్ట్ 1 ముగిసినప్పుడు చూపిన సీన్లే, ఈ టీజర్‌లో పెట్టేశారు. టీజర్ పేరు పెట్టి, పాత సీన్లు మళ్లీ చూపించడాన్ని చూసి కొందరు ప్రేక్షకులు సహించుకోలేక పోతున్నారట.
READ MORE: JR NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో ‘GOD OF WAR’ ఫిక్స్..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
టీజర్‌లో సీన్లు మాత్రమే కాదు.. చివర్లో వినిపించిన డైలాగ్ కూడా పాతదే. “ఇది కొత్త హిందుస్థాన్.. నీ ఇంట్లోకి వచ్చి నిన్ను కూడా చంపుతుంది.” అనే డైలాగ్ పార్ట్ 1లోనే ఉంది. ఇది కూడా మళ్లీ చూపించడంతో ఫ్యాన్స్ అసహనం మరింత పెరిగింది. “కనీసం కొత్త పాత్ర అయినా చూపించాల్సింది కదా”, “ఒక కొత్త సీన్ లేదా పాట అయినా ఉండాల్సింది” అంటూ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఈ టీజర్ పించడానికి ఇంత హడావుడి ఎందుకు చేశారు?” అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు మరింత ఘాటుగా ఉన్నాయి. ఒకరు “టీజర్ పేరుతో మోసం చేశారు” అని రాశారు. ఇంకొకరు “మేం టీజర్‌లో కొత్తదనం ఆశించాం, కానీ ఇవన్నీ మేము పార్ట్ 1లోనే చూశాం” అని కామెంట్స్ చేశారు. “ఇది టీజర్ కాదు, పార్ట్ 1 మిడ్ క్రెడిట్ సీన్” అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కొందరైతే “ఇది ధురంధర్ 2 టీజర్ అనడం కంటే, ధురంధర్ పోస్ట్ క్రెడిట్ సీన్ అనాలి” అంటూ వ్యాఖ్యానించారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేస్తూ “ఫ్యాన్స్‌తో ఇలాంటి ప్రాంక్ ఎందుకు చేశారు?” అని ప్రశ్నిస్తున్నారు.
READ MORE: ‘Michael’ Trailer Out: మళ్లీ తిరిగొచ్చిన ‘కింగ్ ఆఫ్ పాప్’.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ అదుర్స్!
టీజర్‌కు ముందు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా విమర్శల పాలైంది. వర్షంలో తడుస్తూ.. కోపంతో ఉన్న రణవీర్ సింగ్ లుక్‌ని చూపించారు. కానీ ఆ సీన్ కూడా పార్ట్ 1లో ఇప్పటికే ఉందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. పాత సీన్‌ని పోస్టర్‌గా మార్చి, దానిపై ఇంత బజ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా టీజర్‌తో ప్రేక్షకుల ఆశలను మేకర్స్ కొంతవరకు నిరాశ పరిచారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు పార్ట్ 2 మీదే ఉంది. ఈ సినిమా అయినా కొత్తదనంతో ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. కాగా.. ధురంధర్ 2 మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకాయిట్ పాత్ర చనిపోయింది. అందుకే రెండో భాగంలో ఆయన కనిపించే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇదిలా ఉంటే.. ధురంధర్ 1 సినిమా ఎలాగైతే హిట్ అయ్యిందో.. ధురంధర్ 2 కూడా అలాగే మంచి విజయం సాధించాలని కోరుకుందాం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!