Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్.. భర్త ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను CCS పోలీసులకు పంపారు. మొబైల్‌లో కొన్ని అనుమానిత మెసేజ్‌లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి రైల్వే డీఎస్పీ తాజాగా ఎన్టీవీతో మాట్లాడారు. “ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయ శాంతి రెడ్డి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.. కుటుంబ సభ్యులను విచారించాం. ఎలాంటి కుటుంబ కలహాలు లేవు అని చెప్తున్నారు.. ఉద్యోగం చేస్తున్న సంస్థలో కూడా విచారించాం. అక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు.. విజయరెడ్డి, ఇద్దరు పిల్లలని తీసుకుని 30న అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చారు.. ఫ్లాట్ ఫాంపై కొద్దిసేపు పిల్లలతో కలిసి తిరిగారు. చర్లపల్లి వైపు ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళి.. గూడ్స్ ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ మధ్యలో నిల్చున్నారు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఇతను చెప్తున్న ప్రకారం.. ట్రాక్ మధ్యలో ముగ్గురూ ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకుని నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ తప్పుకోండి అని అరుస్తున్న కూడా పక్కకు జరగలేదని చెప్తున్నాడు.. కారులో సూసైడ్ నోట్ లభ్యమైంది.. నా చావుకి ఎవరూ కారణం కాదు. బతకడం భారంగా ఉంది అని రాసి ఉంది. 28న వాళ్ళ పెళ్లి రోజు అని తెలిసింది.. 31న భర్త పుట్టిన రోజు అని తెలిసింది.. బంధువులు ఒకరు చనిపోయారు.. వెళ్ళాలి అని హాస్టల్ లో ఉన్న పిల్లలను తీసుకెళ్లింది తల్లి.. విజయశాంతి మొబైల్ ఫోన్‌ను సీసీఎస్‌కి పంపించాం. లాస్ట్ కాల్ డీటెయిల్స్, అందులో ఉండే సమాచారంతో మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆమె ల్యాప్ టాప్‌ను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించాం.” అని తెలిపారు.
READ MORE: డిజైన్, పవర్‌లో ఫార్చ్యునర్‌కు ఫుల్ ఛాలెంజ్.. MG Majestor టీజర్ రిలీజ్.. లాంఛ్ డేట్ ఫిక్స్!
Also Read
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ఈ సూసైడ్ అంశంపై విజయశాంతి రెడ్డి భర్త తాజాగా ఎన్టీవీతో మాట్లాడారు. “నా భార్య ధైర్యవంతురాలు, ఎందుకు ఆత్మహత్య చేసుకోండి దేవునికి తెలియాలి.. నాకు ఎలాంటి సమాచారం లేదు. చివరిసారిగా నేను నా భార్యతో మాట్లాడినప్పుడు పిల్లల ఎదుగుదల గురించి మాట్లాడాము.. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. నేను దుబాయ్ లో ఉన్నను.. నాకు ఎలాంటి విషయం తెలియదు.. ఆర్థికంగా కుటుంబ పరంగా సమస్యలు లేవు.. ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పేది, కానీ సమస్యలు లేవు.. నా కూతురుతో మాట్లాడాను జేఈఈ ఎగ్జామ్స్ బాగా రాసానని దాడి అని చెప్పింది.. కొడుకు కూతురుకి మంచిగా చదువుకొమణి చెప్పాను.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను CCS పోలీసులకు పంపారూ రైల్వే పోలీసులు. పోలీసులు దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయి.. ఎలాంటి విషయాలున్న మేము కులంకషంగా మాట్లాడే వాళ్ళం. నేను షాక్ లో ఉన్నాను.. నా భార్య చేస్తున్న సంస్థ లో అక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు.. విజయ రెడ్డి తో 29న మాట్లాడాను, 28న కూతురుతో మాట్లాడాను.. ఎవరి పైన నాకు అనుమానం లేదు మరొకసారి ఫిర్యాదు చెయ్యను.. సూసైడ్ నోట్ లోనూ ఏం సమాచారం లేదు.. లోన్లీనెస్ ఫీల్ అయి సూసైడ్ చేసుకుందా తెలియదు.. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలి.” అని భర్త స్పష్టం చేశారు.
READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!