Indian Rupee: వాణిజ్య డీల్ ఎఫెక్ట్.. రూపాయికి మంచి రోజులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: భారత రూపాయికి ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి. మంగళవారం మార్కెట్ ప్రారంభంలోనే రూపాయి బలంగా ముందుకు రావచ్చని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వల్ల మళ్లీ విదేశీ పెట్టుబడులు భారత్ వైపు రావచ్చన్న అంచనాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో రూపాయిపై గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91.51 వద్ద ఉంది. కానీ ఒక నెల నాన్-డెలివరీ ఫార్వర్డ్ లెక్కల ప్రకారం.. మంగళవారం రూపాయి 90.15 నుంచి 90.25 మధ్య స్థాయిలోనే ట్రేడింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. అంటే ఒక్కరోజులోనే రూపాయి గణనీయంగా బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
READ MORE: HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే..?
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ ఒప్పందంతో భారత్‌పై ఉన్న భారీ పన్నుల వ్యవస్థ దాదాపుగా తొలగిపోయినట్లైంది. ఒక దశలో భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన పన్ను 50 శాతానికి చేరింది. అది ఆసియాలోనే అత్యధికం. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించిన శిక్ష పన్నును తీసేయడంతో పాటు, పరస్పర పన్నులను కూడా తగ్గించి 18 శాతానికి పరిమితం చేశారు. దీంతో విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 2025లో భారత్ నుంచి భారీగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ఈ కారణంగా రూపాయి మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. సింగపూర్‌లోని లూసెర్న్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పెట్టుబడుల విభాగం అధిపతి మార్క్ వెలాన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల భారత్‌పై ఉన్న విధానపరమైన అనిశ్చితి తగ్గిందన్నారు. దీని ప్రభావంతో తక్కువ కాలంలోనే రూపాయి, స్టాక్ మార్కెట్లు బలపడే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు.. అనుకున్న విధంగానే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి.
READ MORE: Deputy CM Pawan Kalyan: అధిక ధరలకు మద్యం విక్రయాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!