Sabarimala: శబరిమల మండల-మకరవిళక్కు సీజన్ మొదలైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రధాన అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభమవుతాయి. శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన పవిత్ర జ్వాలతో 18 మెట్లు వద్ద అధి వెలిగించడం, రాత్రి అభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే భక్తుల దర్శనానికి సోమవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత అనుమతి ఇస్తారు. వృశ్చిక మాసం ఆరంభం కావడంతో అప్పుడే అధికారికంగా తీర్థయాత్ర సీజన్ ప్రారంభమవుతుంది. అయితే.. ఈసారి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం ఆధ్యాత్మికంగా…
Hyderabad Cybercrime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐ-బొమ్మ, బప్పం సైట్లను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సైట్లు క్రియేట్ చేసిన రవితోనే వాటిని క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే.. నిందితుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు..
CV Anand: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారని ఆనంద్ తెలిపారు. Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందనలు తెలిపారు.. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని పేర్కొన్నారు… DCP కవిత, CP సజ్జనార్ కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. READ […]
Ravi: ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.. రూ. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.. వైజాగ్‌కి చెందిన రవి టెక్నికల్ ఎక్స్పర్ట్ గా గుర్తించారు.. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ ఐనా, ఎంత సెక్యూర్‌గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలిగే ట్యాలెంట్ ఉంది. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్‌ను సైతం హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి…
Punjab: పంజాబ్‌లో ఒక పెద్ద సంఘటన జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తను కాల్చి చంపారు. ఇంటికి వెళ్తుండగా RSS కార్యకర్తపై దాడి జరిగింది. మృతుడిని నవీన్ అరోరాగా గుర్తించారు. ఈ సంచలనాత్మక సంఘటన తర్వాత.. ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. నిందితులను పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
IBOMMA Ravi: పైరసీ కింగ్ పిన్‌గా మారిన ఐ బొమ్మ రవి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇమ్మడి రవి నేదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్ళే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు. వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ER infotech అనే సాఫ్ట్వేర్ కంపెనీకు CEOగా ఉన్నాడు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తన చదువు, జ్ఞానాన్ని ఉపయోగించి తెలుగు ఇండస్ట్రీని బురిడి కొట్టించాడు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేసిన రవి.. భారీగా…
Shubman Gill Injury: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. మ్యాచ్‌లో రెండవ రోజు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తూ.. మెడ నొప్పితో వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన గిల్ గాయంతో మైదానం రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిపోయాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్ 189 పరుగుల వద్ద ముగిసింది. అయితే.. గిల్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కీలక సమాచారం వెలువడింది. గిల్‌ను స్ట్రెచర్‌పై వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. పలు నివేదికల ప్రకారం..…
Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. నిన్న(శనివారం) ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసీఆర్ మళ్లీ పార్టీలోకి పిలుస్తే వెళతారా..? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. "కేసీఆర్ తండ్రిగా పిలిస్తే తప్పకుండా వెళతాను.. రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పోను.. ఏ పార్టీలోకి నేను ఎందుకు పోతాను.. ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకురాలిని.. బీఆర్ఎస్ నుంచి గెంటి వేయబడ్డ నాయకురాలిగా.. బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోటు పాట్ల గురించి…
Jangaon RTC Bus Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి వైద్య బృందాలు. హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.…
Kerala: కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఓ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిక్కన్నపురం నివాసి ఆనంద్ కె. తంపి తన షెడ్లో శనివారం ఉరి వేసుకుని బలవన్మణానికి పాల్పడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో కలత చెందినట్లు సమాచారం. తిరువనంతపురం కార్పొరేషన్‌లోని త్రిక్కన్నపురం వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని తంపి ఆశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు రాలేదు. ఇది చూసి ఆయన…