CM Chandrababu: క్షేత్రస్థాయిలో పనిచేయండి.. మంత్రులకు సీఎం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరగా పరిష్కరించేలా పనిచేయాలని తెలిపారు.
యుద్ధ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇక, గ్యాస్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం తెలిపారు. అదేవిధంగా ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కృషి చేయాలని సూచించారు. మరోవైపు.. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై పూర్తి వివరాలను వచ్చే నెలలో వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
తాజావార్తలు
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!