మావోయిస్ట్ పార్టీ నేడు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది. వరుస సంఘటనలతో ములుగు ఏజన్సీ ప్రాతంలో టెన్షషన్ వాతావరణం నెలకొంది. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వాజేడు వెంకటాపురం ఏటూరునాగారం ప్రధాన రహదారులు అడుగు అడుగున తనిఖీలు చేస్తున్నాయి. తెలంగాణ ఛత్తీష్‌గఢ్ సరిహద్దులలో వరుస ఎన్కౌంటర్లతో వాజేడు వెంకటాపురం ఏజెన్సీ వాసులలో ఒక్కసారిగా భయాందోళన ఏర్పడింది. ఎప్పుడు ఎక్కడ ఏ తూటా పేలితుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో రాష్ట్ర…
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టక ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంటి టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని యజమాని వెలికి తీశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు పోలీసులు సమాచారం అందించారు.
ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా పంచుకుంది . "కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు ఈ ఫౌండేషన్ మద్దతు తెలిపింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ" అని పేర్కొంది.
అత్యుత్తమ సేవలందించినందుకు గాను ప్రకాష్ విన్నకోటకు ప్రతిష్టాత్మకమైన కామధేను అవార్డును ప్రకటించింది. ఈఎన్టీ వైద్యులకు ఈ అవార్డు అందజేస్తారు. డాక్టర్ విన్నకోట వినికిడి లోపాలతో బాధపడుతున్న వేలాది మంది రోగుల జీవితాలను మార్చడానికి తన వృత్తిని అంకితం చేశారు. ప్రజారోగ్యం, సామాజిక శ్రేయస్సుకు గణనీయంగా తోడ్పడ్డారు. ఆయనలో రోగుల పట్ల నిబద్ధత, వినూత్న పద్ధతులు, కరుణతో కూడిన సంరక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా చాలా మందికి విజయవంతంగా చికిత్స చేశారు. వారికి వినికిడిని అందించారు. వివిధ […]
సిరియాలో తిరుగుబాటు తర్వాత బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం ఇచ్చింది. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు తెలిపింది. మాస్కోలో ఉన్నారని రష్యా రాయబారి మిఖాయిల్ ఉలియానోవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. "బ్రేకింగ్! అస్సాద్, అతని కుటుంబ సభ్యులు మాస్కోలో ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రష్యా తన స్నేహితులకు ద్రోహం చేయదు. ఇదే రష్యా- యూఎస్ మధ్య వ్యత్యాసం." అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కథనంలోని కొన్ని పాయింట్స్ తీసుకుని రాశారు. ఈ కథన ప్రకారం.. "ఇప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరు. ఇలా చేస్తే జరిమానా విధిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఇది జరుగుతోంది." అని పేర్కొన్నారు. ఈ వైరల్ కథనాన్ని చదివిన ప్రజలు షాక్, కలత చెందుతున్నారు.
బాంబు పేలుళ్ల బెదిరింపుతో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ మేరకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది.
భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌లు ముందున్నాయి. అయితే డిజిటల్ ఎగుమతుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మాత్రమే ముందున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారతదేశం 2023లో 257 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ వస్తువులను ఎగుమతి చేస్తుంది. భారతదేశ డిజిటల్ ఎగుమతులు 2022 సంవత్సరంలో 17 శాతం పెరిగాయి.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు."అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది" అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చెందిన ఓ యువతి బహిరంగ ప్రదేశాల్లో ఆభరణాల భద్రతకు సంబంధించి ఆశ్చర్యకరమైన ప్రయోగం చేసింది.