Viral Video: జ్యోతిష్యుడి ముసుగులో కామాంధుడు.. 58 వీడియోలు వెలుగులోకి..
- జ్యోతిష్యుడి ముసుగులో దారుణాలు
- మహిళపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు
- సీసీటీవీ వీడియోలు స్వాధీనం
- హనీట్రాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో జ్యోతిష్యుడిగా చలామణి అవుతూ, రాజకీయ నాయకులు , ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగి ఉన్న అశోక్ ఖరాత్ (67) ఉదంతం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఒక మహిళపై వరుసగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై నాసిక్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధిత 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు ప్రకారం, అశోక్ ఖరాత్ ఆమెను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆమెకు తెలియకుండా అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరించి, వాటిని బయటపెడతానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. తట్టుకోలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Kavitha : మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా.. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
నిందితుడి కార్యాలయంలో పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతని వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సుమారు 58 అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ (CCTV) ద్వారా రహస్యంగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ వీడియోల ఆధారంగా ఖరాత్ మరికొంతమంది మహిళలను కూడా ట్రాప్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మర్చంట్ నేవీలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకుంటూ తనను తాను ‘క్యాప్టెన్’ అని పిలిపించుకునేవాడు. జ్యోతిష్యుడిగా మంచి పేరు ఉండటంతో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. కారణాలు ఇవే..
ఆ పలుకుబడిని ఉపయోగించుకునే ఇతను ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిపై అత్యాచారం, బెదిరింపులు , ఐటి చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏదైనా ‘హనీట్రాప్’ కోణం ఉందా? ఇతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే దిశగా విచారణ ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!