సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు బెదిరిస్తున్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు.
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్‌లో విలాస వంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రూ. 50 కోట్ల విలువైన ఈ విలాసవంతమైన ఫ్లాట్, ఈ ప్రాంతంలోని నివాస ప్రాపర్టీ ధరలకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందట. చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని సమాచారం. ఈ భవనంలోని పదహారవ అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో నాలుగు బెడ్రూమ్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు […]
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు. ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పాత్రలు మాత్రమే మారాయని.. అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగదని తెలిపారు. ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును బట్టి మంత్రులను ఎంపిక చేస్తామన్నారు. ఇక డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మహీంద్రా వాహనాల అమ్మకాలు గత 3 నెలలతో పోల్చితే నవంబర్‌లో అత్యల్పంగా ఉన్నాయి. కంపెనీ సెప్టెంబర్‌లో 51,062 యూనిట్లు, అక్టోబర్‌లో 54,504 యూనిట్లను విక్రయించింది. కాగా, నవంబర్‌లో ఈ సంఖ్య 46,222 యూనిట్లకు తగ్గింది. కంపెనీకి సంబంధించి మహింద్రా థార్ మినహా అన్ని మోడళ్ల అమ్మకాలు తగ్గాయి. ప్రతిసారీ మాదిరిగానే కంపెనీకి తక్కువ డిమాండ్ ఉన్న కారు మరాజో.. నవంబర్‌లో కేవలం 9 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అక్టోబర్‌లో 37 యూనిట్లు విక్రయించారు.
జీప్ ఇండియా తన ప్రీమియం, అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబర్లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్‌పై వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారుల ఆఫర్‌పై రూ. 3.20 లక్షలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ. 1.40 లక్షలు తగ్గించింది. వీటన్నింటితో పాటు కంపెనీ దీనిపై రూ.15,000 ప్రత్యేక ఆఫర్ కూడా ఇస్తోంది. దీంతో మీరు ఈ SUVపై రూ. 4.75 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర […]
ట్రక్కును నడపాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన భారీ మూల్యం తప్పదు. అయితే.. లారీ నడిపేటప్పుడు స్టీరింగ్‌పై రెండు చేతులు ఉంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాళ్లు బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్‌ను నియంత్రిస్తాయి. వీటితో పాటు చేతితో గేర్లు వేస్తాం. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కేవలం తన పాదాలతో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ.. వాహనాన్ని నడపడం కనిపిస్తుంది.
ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ పోరు నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో మిలిటెంట్ చెరలోని తమ బందీలను విడిపించేందుకు టెల్అవీవ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్తగా రూపొందించిన ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE)ని పర్యవేక్షించడానికి ఎలాన్ మస్క్‌ని నియమించారు. ఈ నేపథ్యంలో బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మస్క్ ఫోన్లో చర్చలు జరిపినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్ అయింది. అసలు ఈ సినిమా క్రేజ్…
భవిష్యత్తులో టీఎంసీ బాధ్యతలు చేపట్టనున్న మమతా బెనర్జీ వారసులు ఎవరు? ఈ ప్రశ్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పార్టీలో సీనియర్ నేతలు, యువకుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మమతా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.