ఎలాన్ మస్క్ 2002లో అమెరికా పౌరసత్వం పొందారు. చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. ఆయన తనను తాను హాఫ్-డెమొక్రాట్, హాఫ్ రిపబ్లికన్ అనీ, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకునేవారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లకు ఓటు వేశానని, అంతేకాకుండా జో బైడెన్‌కు అయిష్టంగానే ఓటు వేశానని మస్క్ చెప్పారు. కానీ కొన్నేళ్లుగా ఆయన డోనల్డ్ ట్రంప్‌కు మద్దతిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రచారానికి ప్రధాన మద్దతుదారులలో ఒకరిగా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, గన్ కంట్రోల్ సహా అనేక సమస్యలపై డెమొక్రాటిక్ పార్టీ వైఖరిని మస్క్ విమర్శించారు. ఎన్నికలకు ముందు అనేక రిపబ్లికన్ ర్యాలీలలో ఆయన కనిపించారు. ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడంలో సహాయపడటానికి రాజకీయ కార్యాచరణ కమిటీకి చాలా మొత్తంలో నిధులు సేకరించారు మస్క్. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..
READ MORE: TESLA: భారత్‌లో టెస్లా తొలి షోరూం.. స్థలాన్ని అద్దెకు తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?
ఇలా ట్రంప్ విజయం కోసం కృషి చేసిన మస్క్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ప్రశంసించారు. జేడీ వాన్స్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తాడని ఎలాన్ మస్క్ జోష్యం చెప్పాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ” ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ బాగా పని చేస్తున్నారు. ఈ దేశానికి కాబోయే తదుపరి అధ్యక్షుడు ఆయనే.” అంటూ ఓ పోస్టుకు సమాధానం ఇచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: Hyderabad: 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో..
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. విధేయులకు పట్టం కట్టారు. తన గెలుపుకోసం కృషి చేసిన వారిని కీలక పదవుల్లో నియమించారు. ఆయన గెలుపునకు కృషి చేసిన వారిలో టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఒకరు. విజయం అనంతరం ఎలాన్ మస్క్‌కి ట్రంప్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మస్క్ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు.